మరోసారి కలిసి నటించబోతున్న రియల్ కపుల్.. గెస్ట్ రోల్‏లో కనిపించనున్న సామ్..

Akkineni Nagachaithanya & Samantha Movie Update: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్లో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‏గా

  • Rajitha Chanti
  • Publish Date - 2:12 pm, Sat, 6 March 21
మరోసారి కలిసి నటించబోతున్న రియల్ కపుల్.. గెస్ట్ రోల్‏లో కనిపించనున్న సామ్..

Akkineni Nagachaithanya & Samantha Movie Update: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్లో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‏గా నటిస్తుండగా.. సమ్మర్ కానుకగా ఈ మూవీ ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ సెట్స్ పై ఉండగానే మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చైతు. మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యు అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. మనం తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న సినిమాను హిట్ కొట్టేలా ప్రయాత్నిస్తున్నాడు.

ఈ మూవీ మొదటి షెడ్యూల్ రాజమండ్రిలో జరుపుతున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఇందులో నాగచైతన్య ఓ సాధరణ మధ్యతరగతి కుర్రాడిలా కనిపించబోతున్నట్లుగా సమాచారం. అలాగే ఈ సినిమాలో మాహేష్ ప్యాన్స్ అధ్యక్షుడిగా కనిపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో చైత‌న్య స‌ర‌స‌న ఇద్ద‌రు హీరోయిన్లు రొమాన్స్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఇందులో అక్కినేని సమంత ఈ సినిమాలో గెస్ట్ చేయబోతున్నట్లు టాక్. ఇప్పటికే విక్రమ్ దర్శకత్వంలో వీరిద్దరు కలిసి నటించారు. ఇక మరోసారి చై-సామ్ కలిసి నటిస్తే అభిమానుల‌కు శుభ‌వార్తే. కాగా ఏమాయ చేశావే మూవీలో చై, స‌మంత తొలిసారిగా క‌లిసి న‌టించారు. ఆ సినిమా స‌మయంలోనే ఈ ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ్డారు. ఆ త‌రువాత మ‌నం, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌జిలీ చిత్రాల్లో క‌లిసి న‌టించారు. ఇక స‌మంత న‌టించిన ఓ బేబి మూవీలో చై కెమెరా అప్పియ‌రెన్స్ ఇచ్చారు. ఇక ఇప్పుడు థ్యాంక్యులో స‌మంత క‌న్ఫ‌ర్మ్ న‌టించేంది నిజ‌మైతే మ‌రోసారి ఈ జోడీని తెర‌పైన చూసే అవ‌కాశం అభిమానుల‌కు ల‌భిస్తుంది. ఇక మరోసారి ఈ ముగ్గురి కాంబోలో రాబోతున్న సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read:

KrithiShetty : ఉస్తాద్ సినిమాలో ఉప్పెన బ్యూటీ.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు జోడీగా బెబమ్మ..