
Shankar-Ram Charan movie : శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో శంకర్ డైరెక్షన్ లో మెగాపవర్ స్టార్ చరణ్ హీరోగా దిల్ రాజు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టు దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న 50 వ సినిమా కాగా… చరణ్ హీరోగా యాక్ట్ చేస్తున్న 15 వ సినిమా.. ఇలా ఓకే సినిమా ఇటు ఓ హీరోకు… అటు ఓ ప్రొడ్యూసర్‌కు ఓ మైల్ స్టోన్‌లా నిలవబోతోంది. ఇక తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ హీరోగా సినిమాను అనౌన్స్ చేయడంతో… తమిళ, తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా ఎలా ఉండాలనే టాక్‌లోనే టైం పాస్ చేస్తోంది. ఇక ఈ కాంబినేషన్ పై ఇండస్ట్రీ పెద్దలు కూడా మాట్లాడుతూ.. అప్పుడే ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. వీరిక తోడు డైరెక్టర్ శంకర్, హీరో రామ్ చరణ్‌లు కూడా.. సినిమాను స్టార్ట్ చేయడం కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నామని ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమా పై నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ ‘‘మేం సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలవుతోంది. ఈ ప్రయాణంలో అగ్ర కథానాయకులతోనూ, కొత్తతరంతోనూ, దర్శకులతోనూ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే చిత్రాల్ని రూపొందించాం. ఇప్పుడు మా 50వ సినిమాని చరణ్ కథానాయకుడిగా నిర్మిస్తుండడం ఆనందంగా ఉంది. చరణ్ – శంకర్ కలయిక, అది పాన్ ఇండియా స్థాయి చిత్రం అంటే అంచనాలు పెద్దయెత్తున ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే, ప్రేక్షకులంతా ఆస్వాదించేలా ఈ సినిమాని రూపొందిస్తాం. త్వరలోనే నటీనటులు, సాంకేతిక బృందం వివరాల్ని తెలియజేస్తాం’’ అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :