Shalu Chourasiya: ఆ రోజు కేబీఆర్ పార్క్‌లో ఏం జరిగిందంటే.. అసలు విషయం చెప్పిన చౌరాసియా..

సినీ నటి శాలు చౌరాసియా పై దాడి కలకలం రేపిన విషయం తెలిసిందే. కొండాపూర్‌లో ఉండే శాలు చౌరాసియా తెలుగు, తమిళం సినిమాల్లో నటించారు.

Shalu Chourasiya: ఆ రోజు కేబీఆర్ పార్క్‌లో ఏం జరిగిందంటే.. అసలు విషయం చెప్పిన చౌరాసియా..
Shalu

Updated on: Nov 18, 2021 | 11:44 AM

Shalu Chourasiya: సినీ నటి శాలు చౌరాసియా పై దాడి కలకలం రేపిన విషయం తెలిసిందే. కొండాపూర్‌లో ఉండే శాలు చౌరాసియా తెలుగు, తమిళం సినిమాల్లో నటించారు. ఆమె ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు కేబీఆర్‌ పార్కుకు ఆనుకుని ఉన్న ట్రాక్‌లో వాకింగ్‌ చేసేందుకు వచ్చారు. గంటన్నర పాటు వాకింగ్‌ చేసి ఓ చోట నిలబడ్డారు. ఇంతలో ఓ ఆగంతకుడు వెనుక నుంచి వచ్చి ఆమె మూతికి గుడ్డ కట్టేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో ఆమె కింద పడింది. దీంతో ఆగంతకుడు ఆమెపై దాడి చేశాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. అయితే ఈ కేసు రోజు రాజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో నిందితుడు- నటి చౌరాసియాతో అసభ్యంగా వ్యవహరించినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ఆమె పెదాలు, మెడపై గాయాలున్నట్టు గుర్తించారు. చౌరాసియాను అతడు చెట్ల పొదల చాటుకు తీసుకెళ్లే యత్నం చేశాడనీ.. ఈ క్రమంలోనే ఆమె కాలి మడమకు ఫ్రాక్చర్ అయిందనీ పోలీసులు అంటున్నారు.

తాజాగా చౌరాసియా మీడియాతో కేబీఆర్‌ పార్కు ఘటనను వివరించింది. రాత్రి 8 గంటల సమయంలో తిరిగి పార్క్ చేసిన కారు వద్దకు వస్తుండగా వెనకనుంచి వచ్చిన ఓ వ్యక్తి తనపై దాడిచేశాడని చెప్పారు.తన రెండు చేతులు పట్టుకున్న ఆవ్యక్తి డబ్బులు డిమాండ్ చేశాడని తెలిపింది. అయితే ఫోన్ పే చేస్తానని చెప్తే అప్పుడు ఒక చేయి వదిలేడని ఆసమయంలో 100 డైల్ చేశాను.. అధిగమనించిన ఆ వ్యక్తి తన ఫోన్ లాక్కున్నాడని చెప్పింది. ఆ తర్వాత అతడు చేతులతో దాడి చేయడంతో పాటు ఓ బండరాయితో తనని కొట్టడానికి ప్రయత్నించాడని తెలిపింది. ఆసమయంలో అతడి ప్రైవేట్ పార్ట్స్ పై తన్ని పక్కనే ఉన్న ఫెన్సిగ్ దూకి బయట పడ్డానని తెలిపింది. తన చేతికి ఉన్న డైమెండ్ రింగ్, అలాగే తన ఫోన్ లాక్కున్నాడని.. పోలీసులు వెంటనే వాటిని కనిపెట్టాలని ఆమె కోరింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Priyamani: ఎర్రచీరలో ప్రియమణి అదిరేటి అందాలు.. కుర్రాళ్ల మతులు పోవాల్సిందే.! వైరల్ పిక్స్!

Madonna Sebastian: అందాల సోయగం మడోన్నా సెబాస్టియన్ సొగసు చూడతరమా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్..

Jai Bhim: సూర్య సినిమా ఆస్కార్‌ అందుకుంటుంది.. జై భీమ్‌పై ఎమ్మెల్యే సీతక్క ట్వీట్‌..