నేను విమర్శలను పట్టించుకోను- షాహిద్ కపూర్

|

Jun 27, 2019 | 1:53 AM

అర్జున్ రెడ్డి..ఈ మూవీ టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతకంటే ఎక్కువ విమర్శలను ఎదుర్కొంది. ఏది ఏమైనా కలెక్షన్ల సునామీ సృష్టించింది. తాజాగా ఆ మూవీ బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. అక్కడ కూడా కలెక్షన్ల వరద పారిస్తున్న ఈ సినిమా అదే  స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటోంది. మహిళలను కించ పర్చే విధంగా ఈ చిత్రంలో సీన్స్ ఉన్నాయంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినిమాపై కోర్టుకు కూడా వెళ్లారు. హీరో […]

నేను విమర్శలను పట్టించుకోను- షాహిద్ కపూర్
Follow us on

అర్జున్ రెడ్డి..ఈ మూవీ టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతకంటే ఎక్కువ విమర్శలను ఎదుర్కొంది. ఏది ఏమైనా కలెక్షన్ల సునామీ సృష్టించింది. తాజాగా ఆ మూవీ బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. అక్కడ కూడా కలెక్షన్ల వరద పారిస్తున్న ఈ సినిమా అదే  స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటోంది. మహిళలను కించ పర్చే విధంగా ఈ చిత్రంలో సీన్స్ ఉన్నాయంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినిమాపై కోర్టుకు కూడా వెళ్లారు. హీరో షాహిద్ కపూర్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

సమయంలోనే షాహిద్ కపూర్ తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అయితే వాటిని ఆయన లైట్ తీసుకుంటున్నాడు.  తాను ఏ సినిమాలో నటించే సమయంలో అయినా తన పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంది.. పాత్రలో తన నటకు ఏంత వరకు ఆస్కారం ఉంటుందని చూస్తాను. అంతే తప్ప సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనే విషయాలను నేను పరిగణలోకి తీసుకోనంటూ చెప్పుకొచ్చాడు. ‘ప్రస్తుతం నాపై వస్తున్న విమర్శలకు నేను భయపడను. ఎందుకంటే ఇది నా మొదటి సినిమా కాదు. నా మొదటి సినిమాకు ఇలాంటి విమర్శలు వస్తే భయపడేవాడినేమో’ అన్నాడు.

30 సినిమాలు చేసిన తనకు ఇలాంటి విమర్శలు అలవాటు అయ్యాయని తెలిపాడు. కబీర్ సింగ్ గురించి కొందరు చేస్తున్న విమర్శలను అసలు తాను పట్టించుకోవడం లేదని.. వారి బెదిరింపులు నన్నేం చేయలేవంటూ షాహిద్ అన్నాడు. నేను నటించే ప్రతి సినిమా వెరైటీగా ఉండాలనే కోరుకుంటాను. అంతే తప్ప ఆ సినిమా వల్ల విమర్శలు వస్తాయా.. బెదిరింపులకు దిగుతారా అనే విషయాన్ని తాను పరిగణలోకి తీసుకోనన్నాడు.