భారతీయ సినిమా చాలా గొప్పది. టాలీవుడ్‌తో పాటు, హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ ఇండస్ట్రీలున్నాయి. ఇక్కడి హీరోలు భారీ రెమ్యునరేషన్లు అందుకుంటున్నారు. ఒక్కో సినిమాకు వందల కోట్లు పారితోషికం తీసుకునే స్టార్లు కూడా ఇండియాలో ఉన్నారు. ఒక సినిమాలో ఫేమస్ అయిన తర్వాత చాలా బ్రాండ్‌లకు ప్రకటనలు ఇచ్చే అవకాశం వస్తుంది. దీని నుండి కూడా డబ్బు వస్తుంది. ఇక వ్యాపారాలతోనూ ఆదాయం ఆర్జిస్తున్నారు. మరి భారతదేశంలోని టాప్ 10 సంపన్న నటుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. ఈ జాబితాలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ దే అగ్రస్థానం. ఒక్కో సినిమాకు వందల కోట్ల రూపాయలు అందుకుంటున్నాడీ స్టార్ హీరో. పైగా ఐపీఎల్‌లో సొంత జట్టు ఉంది. నిర్మాణ సంస్థ ఉంది. అనేక బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడు. షారుఖ్ మొత్తం ఆస్తుల విలువ 6300 కోట్ల రూపాయలు.
హృతిక్ రోషన్
బాలీవుడ్‌లోని ప్రతిభావంతులైన హీరోలలో హృతిక్ రోషన్ ఒకరు. ఒక్కో సినిమాకు 50-60 కోట్లు తీసుకుంటున్నాడు. బ్రాండ్ ప్రమోషన్ కోసం రూ.10 కోట్లు తీసుకుంటాడు. అతను తన సొంత దుస్తులు-షూ బ్రాండ్‌ను కలిగి ఉన్నాడు. ఆయన ఆస్తి 3100 కోట్ల రూపాయలు.
అమితాబ్ బచ్చన్
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఎన్నో దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఉంటున్నారు. సినిమాలతో పాటు ‘కౌన్ బనేగా కరోపతి’ అనే టెలివిజన్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఒక్కో సినిమాకు 10 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. ఆయన ఆస్తి 3000 కోట్ల రూపాయలు. ప్రభాస్ సరసన ఆయన నటిస్తున్న ‘కల్కి 2898 AD’ ఫస్ట్ గ్లింప్స్ ఇటీవలే విడుదలైంది.
సల్మాన్ ఖాన్
బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ బ్రాండే వేరు. అతనికి సొంతంగా దుస్తుల బ్రాండ్ కంపెనీ, ఒక స్వచ్ఛంద సంస్థ ఉన్నాయి. 57 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని సల్మాన్‌క ఆస్తుల విలువ సుమారు 2850 కోట్ల రూపాయలు.
అక్షయ్ కుమార్
బాలీవుడ్‌లో వేగంగా సినిమాలు చేసే హీరోల్లో అక్షయ్ కుమార్ ముందుంటాడు. ఏడాదిలో ఆయన నటించిన మూడు-నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. ఆయన ఆస్తి 2,660 కోట్ల రూపాయలు. మన దేశంలో అత్యధిక పన్ను చెల్లించే హీరోల్లో అక్షయ్‌దే అగ్రస్థానం
అమీర్ ఖాన్
నటుడు అమీర్ ఖాన్ నటనకు విరామం ఇచ్చాడు. అలాగని ఆయనకు డిమాండ్ తగ్గలేదు. అమీర్ చాలా వెంచర్లలో పెట్టుబడి పెట్టాడు. పైగా సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఆయన ఆస్తి 1862 కోట్ల రూపాయలు.
రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా తో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ఈ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్ దక్కింది. ఈ స్టార్ నటుడికి చాలా డిమాండ్ ఉంది. చెర్రీ ఆస్తి 1370 కోట్ల రూపాయలు. ప్రైవేట్ జెట్ కూడా ఉంది.
అక్కినేని నాగార్జున
అగ్రహీరో అక్కినేని నాగార్జున ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. అలాగే బిగ్‌బాస్ హోస్ట్‌గా రూ.15 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. నాగార్జునకు మొత్తం ఆస్తుల విలువ రూ. 950 కోట్లని తెలుస్తోంది.
రజనీకాంత్
కోలీవుడ్ స్టార్ యాక్టర్ రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా కొనసాగుతున్నారు. ఆయన నటించిన ‘జైలర్’ సినిమా సూపర్ హిట్. ఈ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. ఆయన ఆస్తి దాదాపు 450 కోట్ల రూపాయలకు పైమాటే.
అల్లు అర్జున్
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఆస్తి 380 కోట్ల రూపాయలు. అతనికి సొంత మల్టీప్లెక్స్ ఉంది. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా ఉన్నాడు.