
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కొన్నాళ్ల క్రితమే జవాన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు షారుఖ్. అలాగే ఇటు కమర్షియల్ యాడ్స్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు. ఇదిలా ఉంటే.. షారుఖ్ వయసు ఇప్పుడు 59 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ 25 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తూ యువతకు షాకిస్తున్నాడు. ఈ వయసులోనూ సిక్స్ ప్యాక్ తో యంగ్ హీరోలకు సైతం గట్టిపోటీనిస్తు్న్నారు. దీంతో షారుఖ్ డైట్ ప్లాన్, ఫిట్నెస్ సీక్రెట్ తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తన ఫిట్నెస్ పై క్లారిటీ ఇచ్చారు షారుఖ్.
గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను రోజుకు రెండు పూటల మాత్రమే తింటానని అన్నారు. మధ్యాహ్నం , రాత్రి భోజనం మాత్రమే చేస్తానని.. జంక్ ఫుడ్ అసలే తిననని అన్నారు. తన ఆహారంలో కేవలం మొలకెత్తిన ధాన్యాలు, గ్రిల్డ్ చికెన్, బ్రోకలీ ఎక్కువగా తీసుకుంటానని.. అప్పుడప్పుడు చిక్కుళ్లు తింటానని అన్నారు. చాలా సంవత్సరాలుగా ఇదే డైట్ ఫాలో అవుతున్నానని.. తన డైట్ విషయంలో పెద్దగా మార్పులు జరగలేదని అన్నారు. ఇక విమానంలో ప్రయాణించినప్పుడు, అతిథుల ఇళ్లకు వెళ్లినప్పుడు సైతం వారు ఇచ్చే ఆహారాన్ని నో చెప్పకుండా తీసుకుంటానని అన్నారు.
బిర్యానీ, రోటీ, నెయ్యి, లస్సీ లాంటి ఏ ఆహారమైనా తనకు ఇచ్చినా తాను ఎప్పుడూ నో చెప్పనని అన్నారు. అలాగే ఒకే ఆహారాన్ని రోజుకు రెండుసార్లు తినడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పుకొచ్చారు. ఆహారం విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు లేవి.. కేవలం శ్రద్ధ మాత్రమే తీసుకుంటానని అన్నారు. దీంతో ఇప్పుడు షారుఖ్ చెప్పిన ఫిట్నెస్ సీక్రెట్ విషయాలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..