
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ సినిమా జవాన్. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ. 650 కోట్లు వసూలు చేసింది. జవాన్ సక్సెస్‌ను పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు చిత్ర బృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్.. ఇలా అన్ని రంగాల సినీ సెలబ్రిటీలు షారుక్ చిత్రబృందానికి కంగ్రాట్స్ చెబుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్‌బాబు జవాన్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ షారుక్ మూవీకి విషెస్ తెలిపారు. ‘ఇంత పెద్ద హిట్ సొంతం చేసుకున్నందుకు జవాన్ చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. జవాన్ సినిమా పూర్తిగా షారుఖ్ మాస్ అవతార్. షారుఖ్ స్వాగ్ ను చూసి ఫిదా అయ్యాను. విజయ్ సేతుపతి ఎప్పటిలాగే తన పాత్రకు ప్రాణం పోశారు. దీపికా పదుకొణె, నయనతారలు తమ అందంతో మెరిశారు. అనిరుధ్ రవిచందర్ తన సాంగ్స్‌ను పదే పదే వినేలా చేశాడు. ఇక కమర్షియల్ సినిమాను అందరూ ఆలోచింపజేసే విధంగా తీసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన దర్శకుడు అట్లీకి అభినందనలు’ అని ట్వీట్ చేశారు అల్లు అర్జున్. దీంతో ఒక్కసారిగా ఈ పోస్ట్ వైరలవుతోంది. దీనికి షారుక్ ఖాన్ కూడా వెంటనే స్పందించారు. ‘మీరు నాపై చూపిస్తున్న ప్రేమతో ఎంతో సంతోషంగా ఉన్నాను. మీ ట్వీట్‌తో జవాన్ సక్సెస్‌ను రెండోసారి ఆస్వాదిస్తున్నాను. మీరు నటించిన పుష్ప సినిమాను మూడు రోజుల్లో మూడు సార్లు చేశాను. మీనుంచి
ఇక ఈ ట్వీట్‌కు షారుక్ (Shah Rukh Khan) స్పందిస్తూ మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందన్నారు. ‘మీ మాటలతో చెప్పలేనంత సంతోషంగా ఉంది. నాపై చూపిస్తున్న ప్రేమకు ఎంతో సంతోషం. మీ ట్వీట్‌తో ‘జవాన్’ విజయాన్ని నేనిప్పుడు రెండోసారి ఆస్వాదిస్తున్నాను. మీరు నటించిన ‘పుష్ప’ సినిమాను మూడురోజుల్లో మూడు సార్లు చూశాను. అలాగే ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వీలైనంత త్వరలో మిమ్మల్ని పర్సనల్‌గా కలిసి నా ప్రేమను తెలియజేస్తాను. లవ్యూ’ అని రిప్లై ఇచ్చారు షారుక్. ఇక బన్నీ ట్వీట్‌కు అనిరుధ్ థ్యాంక్స్ చెప్పగా దీనికి మరో ఫన్నీ రిప్లై ఇచ్చాడు బన్నీ. ‘కేవలం థ్యాంక్స్ చెబితే కుదరదు. నాకూ మంచి పాటలు అందించాలి’ అని రాసుకొచ్చారు అల్లు అర్జున్. ప్రస్తుతం వీరి సంభాషణలు నెట్టింట వైరల్‌గా మారాయి. ముఖ్యంగా అనిరుధ్ ట్వీట్‌కు బన్నీ రిప్లైతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందా? అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అలాగే ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించే అవకాశముందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..