రైల్వే స్టేషన్లతో తనకున్న ఎటాచ్‌మెంట్‌ను గుర్తు చేసుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్. ముంబయిలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో షారుక్ కొత్త పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించేందుకు వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బాంద్రా రైల్వే స్టేషన్‌కు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను రైల్వే స్టేషన్లలోనే ఎంతో మంది అమ్మాయిలను సినిమాల్లో ప్రేమించాను . ముంబయిలోని అన్ని రైల్వే స్టేషన్లను చూశాను కానీ బాంద్రా చూడలేదు. ఈరోజు ఆ లోటూ తీరిపోయింది. ఇప్పుడు నేను బాంద్రా స్టేషన్ చూశాను కాబట్టి మున్ముందు నేను నటించబోయే సినిమాల్లోని హీరోయిన్లను ఇక్కడి తరచూ తీసుకొస్తూ ఉంటాను’ అని సరదాగా వ్యాఖ్యానించారు. షారుక్ నటించిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాలోని రైలు సన్నివేశం ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. ఆ తర్వాత వచ్చిన ‘దిల్ సే’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాల్లోనూ ఫేమస్ రైలు సన్నివేశాలు ఉన్నాయి.
It is important for the posterity to know about their heritage, whether it be a monument, building, galli or city. There should be an archieval concept for it- Mr @iamsrk at the release of postal cover on Bandra Railway Station with Shri @ShelarAshish. #heritage pic.twitter.com/4DEUrFx8R2
— Western Railway (@WesternRly) August 23, 2019