
తెలుగు టెలివిజన్ రంగంలో తన అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ సీరియల్ నటి శిరీష వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పలు పాపులర్ సీరియల్స్‌తో పాటు ప్రైవేట్ సాంగ్స్‌తో విశేష గుర్తింపు తెచ్చుకున్న శిరీష, తోటి నటుడు, యాంకర్ మహేంద్రను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆగస్టు 28న అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ‘మొగలిరేకులు’, ‘రాములమ్మ’, ‘స్వాతి చినుకులు’, ‘చెల్లెలి కాపురం’, ‘నేను శైలజ’ వంటి అనేక ధారావాహికల ద్వారా నటి శిరీష తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఇక వరుస సీరియల్స్ చేస్తూనే మరోవైపు యాంకర్‌గా కూడా రాణిస్తున్న మహేంద్రతో ఆమెకు బుల్లితెర షూటింగ్స్ సమయంలో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా కాలక్రమేణా మంచి స్నేహంగా, ఆపై గాఢమైన ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలను ఒప్పించి పెద్దల అంగీకారంతోనే వీరు ఏడడుగులు నడిచారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..
పెళ్లికి సంబంధించిన అందమైన ఫొటోలను ఈ జంట తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఈ నవదంపతులకు బుల్లితెర సెలబ్రిటీలు, తోటి నటీనటులు అలాగే అభిమానుల నుంచి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శిరీష గతంలో వివాహం చేసుకొని విడాకులు తీసుకున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ, తన గతాన్ని వెనక్కి నెట్టి మహేంద్రతో కొత్త జీవితాన్ని ప్రారంభించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..
ఇంటింటి రామాయణం, మగువా ఓ మగువా వంటి ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్న మహేంద్ర-శిరీష జంట నిజ జీవితంలోనూ కలిసి ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం విశేషం.
ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..
ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..