Tollywood : అబ్బో రచ్చ రంబోలా..!! సీరియల్‌లో సాఫ్ట్.. బయట మాత్రం బీభత్సం

|

May 16, 2024 | 12:00 PM

ఒక్క ఎపిసోడ్ మిస్ అయితే చాలు ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిల కొట్టేసుకుంటుంటారు. అంతలా ఈ సీరియల్స్ ఆడవాళ్లను ఆకట్టుకుంటున్నాయి. సినిమాలకు మించిన ట్విస్ట్ లు, సెంటిమెన్స్, ఎమోషన్స్ అబ్బో చెప్పుకుంటూ పొతే చాలానే ఉన్నాయి. అందుకే ఆ సీరియల్స్ మూడు నాలు ఏళ్లు సాగుతూ ఉంటాయి. పై ఫొటోలో ఉన్న సీరియల్ నటిని గుర్తుపట్టారా.? ఆడవాళ్లు టక్కున చెప్పేస్తారు లెండి..

Tollywood : అబ్బో రచ్చ రంబోలా..!! సీరియల్‌లో సాఫ్ట్.. బయట మాత్రం బీభత్సం
Actress
Follow us on

సినిమాలు ఏ  రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తున్నాయో సీరియల్స్ కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.సాయంత్రం అయితే చాలు ఇంట్లో ఆడవాళ్ళందరూ టీవీలకు అతుక్కుపోతారు.. ఈ మధ్య మగాళ్లు కూడా టీవీ సీరియల్స్ కు అట్రాక్ట్ అవుతున్నారు. ఒక్క ఎపిసోడ్ మిస్ అయితే చాలు ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిల కొట్టేసుకుంటుంటారు. అంతలా ఈ సీరియల్స్ ఆడవాళ్లను ఆకట్టుకుంటున్నాయి. సినిమాలకు మించిన ట్విస్ట్ లు, సెంటిమెన్స్, ఎమోషన్స్ అబ్బో చెప్పుకుంటూ పొతే చాలానే ఉన్నాయి. అందుకే ఆ సీరియల్స్ మూడు నాలు ఏళ్లు సాగుతూ ఉంటాయి. పై ఫొటోలో ఉన్న సీరియల్ నటిని గుర్తుపట్టారా.? ఆడవాళ్లు టక్కున చెప్పేస్తారు లెండి.. ఇక ఈ మధ్య ఎక్కువగా చూస్తున్న సీరియల్స్ లో గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఒకటి.

ఈ సినిమాలో మీన అనే పాత్రలో నటించిన అమ్మడు గుర్తుందా.? ఆమె పేరు అమూల్య గౌడ. కన్నడలో పలు సీరియల్స్ లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు తెలుగులోనూ నటిస్తుంది. ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్ తో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ చిన్నది.

కన్నడ భాషలో శ్రీ గౌరీ అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. అలాగే అక్కడ బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొంది. బిగ్ బాస్ లో తన అందంతో పాటు ఆటతోనూ ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. అయితే సీరియల్స్ లో పద్దతిగా కనిపించే అమూల్య గౌడ.. బయట మాత్రం చాలా హాట్ గురూ.. ఈ అమ్మడి సోషల్ మీడియా పోస్ట్ లు చూస్తే మతిపోవాల్సిందే.. తన అందాలతో మతిపోగొడుతోంది అమూల్య. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అందాల ఆరబోతలో హీరోయిన్స్ కు ఈ మాత్రం తీసిపోవడం లేదు ఈ సీరియల్ నటి. అమూల్య ఇన్ స్టా గ్రామ్ లో 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. హాట్ హాట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది అమూల్య. ఈ ఫోటోలు, వీడియోలు చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్. ఆమె ఈమేనా అని కామెంట్స్ చేస్తున్నారు. సీరియల్స్ లో పద్దతిగా కనిపిస్తుంది.. సోషల్ మీడియాలో మాత్రం సెగలు రేపుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిన్నదాని గ్లామరస్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

అమూల్య గౌడ్ ఇన్ స్టా పోస్ట్

అమూల్య గౌడ్ ఇన్ స్టా పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.