Doraswamy Raju: టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్‌ నిర్మాత వి.దొరస్వామి రాజు కన్నుమూత..

| Edited By: Pardhasaradhi Peri

Jan 18, 2021 | 9:11 AM

Doraswamy Raju: టాలీవుడ్‌ సీనియర్‌ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ వి.ఎం.సి అధినేత వి.దొరస్వామిరాజు సోమవారం ఉదయం కన్నుమూశారు.

Doraswamy Raju: టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్‌ నిర్మాత వి.దొరస్వామి రాజు కన్నుమూత..
Follow us on

Doraswamy Raju: టాలీవుడ్‌ సీనియర్‌ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ వి.ఎం.సి అధినేత వి.దొరస్వామిరాజు సోమవారం ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజుల నుంచి వయో భారంతో దొరస్వామిరాజు ఆరోగ్యం క్షీణించింది. అనారోగ్యంతో ఆయన బంజారా హిల్స్‌ కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, కిరాయిదాదా, అన్నమయ్య, సింహాద్రి, వెంగమాంబ, భలే పెళ్లాం వంటి సినిమాలను ఆయన నిర్మించారు.

వి.ఎం.సి(విజయ మల్లీశ్వరి కంబైన్స్‌) పేరు మీద సినీ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసును ప్రారంభించి ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి సీడెడ్‌లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌గా ఈయన పేరు పొందారు. 1994లో నగరి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీటీడీ బోర్డు మెంబర్‌గా, ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌, డిస్ట్రిబ్యూషన్‌ అండ్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌, ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఇలా ఎన్నో పదవులను అలంకరించారు. కొంతకాలంగా నిర్మాణ రంగానికి దూరంగా ఉన్న దొరస్వామిరాజు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా చెప్పవచ్చు.

 

సంచయితపై ఘాటు వ్యాఖ్యలు చేసిన అశోక్ గజపతిరాజు.. తండ్రి, తాతను కూడా కలవలేదంటూ విమర్శలు..!

రెమ్యునరేషన్ అప్పటికి ఇప్పటికి పెంచేశాడంట.. ఇమేజ్ పెరగడంతో నిర్మాతకు షాకిచ్చిన నాగబాబు తనయుడు