
రీసెంట్ డేస్ లో హీరోయిన్స్ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలతో పాటు గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా వెనకడుగు వేయడంలేదు.. కథకు అవసరమైతే బోల్డ్ సీన్స్ లోనూ నటిస్తామని ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ చెప్తున్నారు. మొన్నటివరకు పద్దతిగా కనిపించిన హీరోయిన్స్ కూడా ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేస్తున్నారు.. రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటిస్తున్నారు. ఇటీవలే అనుపమ మరమేశ్వన్ కూడా టిల్లు స్క్వేర్ సినిమాకోసం అందాల కంచెలు తెంచేసి అందరికి షాక్ ఇచ్చింది. సాయిపల్లవి తప్ప.. యంగ్ హీరోయిన్స్ అందారూ దాదాపు ఇలానే ఉన్నారు. బోల్డ్ సీన్స్ ను, రొమాంటిక్ సన్నివేశాలను పెద్దగా పట్టించుకోవడం లేదు అందాల భామలు. అయితే ఇప్పుడు ఓ సీనియర్ హీరోయిన్ కూడా రొమాన్స్ కు వయసుతో పనిలేదు అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ప్రేమకు వయసుతో పనిలేదు అనే మాట మనం తరచుగా వింటుంటాం.. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం శృంగారానికి వయసుతో పనిలేదు అంటుంది. కథకు అవసరమైతే ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటిస్తానని చెప్పుకొచ్చింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. సీనియర్ హీరోయిన్ టబు. ఈ ముద్దుగుమ్మను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెలుగు తెరకు పరిచయం చేశారు. వెంకటేష్ హీరోగా నటించిన కూలి నెంబర్ వన్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది టబు. ఆతర్వాత నిన్నే పెళ్లాడతా..? ఆవిడా మాఆవిడే, చెన్నకేశవరెడ్డి, అందరివాడు, పాండు రంగడు, ఇది సంగతి సినిమాల్లో నటించి మెప్పించింది. ఆతర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అయ్యింది.
తమిళ్‌లోనూ ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అక్కడ ఆమె నటించిన కాదల్ దేశమ్ తెలుగులో ప్రేమ దేశం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చాలా కాలం తర్వాత తెలుగులో అల వైకుంఠపురం లో అనే సినిమాలో నటించింది. ఇక ఈ వయసులోనూ టబు తన అందంతో ఆకట్టుకుంటుంది. హిందీలో ఇటీవలే క్రూ అనే సినిమా చేసింది. ఈ సినిమాలో బోల్డ్ గా కనిపించి ఆకట్టుకుంది. బాలీవుడ్ లో ఈ అమ్మడికి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ అజయ్‌దేవగన్‌తో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది. ఇప్పుడు అరోన్ మే క్యా దమ్ థా అనే సినిమాలో నటిస్తుంది. 50 ఏళ్ల వయసులో శృంగారపు సన్నివేశాలకు రెడీ అయిన టబు తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. శృంగారం కేవలం యువకులకు లేదా పరిమిత వయస్సుకు మాత్రమే కాదని తెలిపింది టబు. తన కొత్త సినిమా ప్రేమ, శృంగారం కంటే రిలేషన్ షిప్‌తో ముడిపడి ఉంటుందని తెలిపింది. అలాగే ప్రేమ,శృంగారంలాంటివి మానవ సంబంధాలలో భాగమని టబు చెప్పుకొచ్చింది. ఈ అమ్మడి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..