AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sobhan Babu: ఎవరికి రూపాయి ఇవ్వలేదు.. పరమ పీనాసోడు.. శోభన్ బాబు గురించి ఆ స్టార్ నటి అలా అనేసిందేంటి?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో శోభన్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం మన్మథుడు నాగార్జున గురించి ఎలా మాట్లాడుతున్నామో ఒకప్పుడు శోభన్ బాబు గ్లామర్, హెయిర్ స్టైల్ గురించి ఇండస్ట్రీలో గొప్పగా మాట్లాడుకునేవారు. అయితే శోభన్ బాబు డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా ప్రవర్తించేవారు.

Sobhan Babu: ఎవరికి రూపాయి ఇవ్వలేదు.. పరమ పీనాసోడు.. శోభన్ బాబు గురించి ఆ స్టార్ నటి అలా అనేసిందేంటి?
Sobhan Babu
Basha Shek
|

Updated on: May 24, 2026 | 5:18 PM

Share

టాలీవుడ్ లో ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో శోభన్ బాబు ఒకరని చెప్పవచ్చు. అందుకే ఆయనకు అందాల నటుడు, సోగ్గాడు, అంధ్రా అందగాడు.. ఇలా చాలా పేర్లు, బిరుదులు ఉన్నాయి. కొన్ని సినిమాల్లో ఆయన హీరోయిన్ల కంటే అందంగా కనిపించారంటే అతిశయోక్తి కాదు. అందుకే సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా శోభన్ బాబును లైక్ చేసేవారు. ఇక హీరోయిన్లు అయితే సోగ్గాడితో కలిసి నటించడానికి పోటీ పడేవారు. అలా సుమారు 35 ఏళ్ల తన సినిమా కెరీర్ లో దాదాపు 200 కు పైగా సినిమాల్లో నటించారు శోభన్ బాబు. అందులోనూ దాదాపు అన్నీ హీరో పాత్రలే. ఏవో రెండు మూడు సినిమాల్లో మాత్రమే సహాయక నటుడిగా కనిపించారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. డబ్బు విషయంలో శోభన్ బాబు చాలా నిక్కచ్చిగా వ్యవహరించేవారు. సినిమాల్లో సంపాదించిన డబ్బునంతా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టేవారు. ఈ క్రమంలోనే ఆయన భారీగా ఆస్తులు పోగేసినట్లు సమాచారం. అయితే డబ్బు విషయంలో శోభన్ బాబు చూపిన అతి జాగ్రత్త ఆయనకు కొంచెం చెడ్డ పేరు తీసుకొచ్చిందన్న ప్రచారం ఉంది. పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టడని, దాన ధర్మాలు చేసేవారు కూడా కాదని కొంత మంది ఆయన గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు.

అయితే శోభన్ బాబు గుప్త దానాలు చేశారని, అయితే వాటిని ఎక్కడా చెప్పుకోలేదని కృష్ణం రాజు లాంటి హీరోలు శోభన్ బాబును కొనియాడారు. అయితే సీనియర్ నటి రమాప్రభ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శోభన్ బాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. శోభన్ బాబు విషయానికి వస్తే.. చాలా పీనా సోడు, పక్కా బిజినెస్ మైండ్, నోరు తెరిస్తే డబ్బు గురించి తప్పితే వేరే విషయం మాట్లాడడు. ఎవరికీ రూపాయి ఇవ్వడు. తన తిండే తాను తినడు. తన బట్టలు తాను వేసుకోడు. ఆయన గురించి ఇంతకంటే ఏం చెప్పలేను’ అని చెప్పుకొచ్చారు రమా ప్రభ.

ఇవి కూడా చదవండి

అయితే డబ్బు విషయంలో తన ఆలోచనలు, ప్రణాళికల గురించి ఓ ఇంటర్వ్యూలో శోభన్ బాబు ఇలా మాట్లాడారు. ‘ చాలా మంది నన్ను పిసినారి అంటున్నారు. ఎన్టీఆర్ ఓ మాట అంటుండేవారు. నా అభిమానులందరికి తలా ఒక్క రూపాయి ఇచ్చుకుంటూ వెళ్తే.. ఆతరువాత ఆ రూపాయి నేను అందరిని అడుక్కోవలసి వస్తుంది.. అని అనేవారు. అందుకే నేను అపాత్రదానం చేయను. అర్ధం లేని చోట ఎక్కువ ఖర్చు పెట్టను.  నన్ను నమ్ముకున్న 60 కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని నేను డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటాను. ఆ 60 కుటుంబాలకు నేను ఎంత చేశాను, ఏం చేశాను, ఎంత మంది నావల్ల చదువుకుంటున్నారు  అనేది నేను ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. దానం చేసి చెప్పుకోవలసిన అవసరం కూడా లేదు. ఎవరు ఎన్ని అన్నా.. నేను ఏం చేశాను అన్నది నాకు తెలుసు’ అని శోభన్ బాబు ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us