
ఎన్నో వందల సినిమాల్లో నటించి నవ్వులు పంచారు రమాప్రభ.హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తల్లిగా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం వయోభారం కారణం గా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమధ్య యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇండస్ట్రీలో తన అనుభవాలను, అలాగే ప్రముఖుల గురించి అనేక వివరాలను పంచుకున్నారు రమా ప్రభ. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అనే విషయాలను పంచుకున్నారు. దివంగత నటుడు శోభన్ బాబు గురించి అనేక విషయాలు తెలిపారు. శోభన్ బాబుతో ఆమె చాలా సినిమాల్లో నటించారు. అలాగే వ్యక్తిగతంగా ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఆయన గురించి మాట్లాడుతూ.. శోభన్ బాబును “పిసినారి “అని రమాప్రభ అన్నారు, ఆయనకు బిజినెస్ మైండ్ ఉండేదని పేర్కొన్నారు. “నోరు తెరిస్తే డబ్బు తప్ప ఏం మాట్లాడడు” అని, “తన తిండే తను తినడు, తన బట్టలు తను వేసుకోడు” అని అన్నారు రమాప్రభ. ఆయన చాలా జాగ్రత్తగా ఉండే వాడని అది ఆయనకు ఎంతో సహాయపడిందని అన్నారు.
శోభన్ బాబు గురించి మాట్లాడిన తర్వాత, రమాప్రభ ఆధ్యాత్మిక అంశాల గురించి మాట్లాడారు. పునర్జన్మలు, కర్మ సిద్ధాంతం, ఆత్మ సంబంధాల గురించి ఆమె మాట్లాడుతూ.. మనిషి తన గత జన్మలో చేసిన తప్పులకు ఈ జన్మలో ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడని. “గత జన్మది ఇప్పుడు అనుభవిస్తూ, దాన్ని ఎరుకతో గమనిస్తే తగ్గుతూ వస్తుంది” అనే సూత్రాన్ని తాను నమ్ముతాను అని తెలిపారు.
కోటీశ్వరుడికి రోగం వస్తే డబ్బు ఉన్నా ఏం తినలేడని, కాళ్లు లేని కోటీశ్వరుడు ఎలా నడవగలడని ప్రశ్నించారు. చిన్న పిల్లలకు ప్రమాదాలు ఎందుకు జరుగుతాయన్న ప్రశ్నకు సమాధానంగా, వారు తప్పు చేయకపోయినా, వారి ఆత్మ చేసిన తప్పులు లేదా వారి తల్లిదండ్రుల పాపాలు ఆ పిల్లల ద్వారా శిక్షించబడతాయని ఆమె అన్నారు. తల్లిదండ్రులు చేసిన పాపానికి పిల్లలు క్షోభించడాన్ని చూసి వారు బాధపడతారని, ఇది కర్మ సిద్ధాంతంలోని ఒక కోణమని ఆమె వివరించారు. అలాగే మనిషి సంబంధాలు కూడా కేవలం ఈ జన్మకు మాత్రమే పరిమితం కావని, గత జన్మల బంధాలు, ప్రేమలు, శత్రుత్వాలు ఈ జన్మలో వివిధ రూపాల్లో కొనసాగుతాయని ఆమె అన్నారు ఇలా అనేక విషయాలను ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.