Actress Prema : సౌందర్య మృతిని తల్చుకుని ఎమోషనల్ అయిన ప్రేమ.. ఆరోజు జరిగింది అదేనంటూ..

తెలుగు ప్రేక్షకులు ఆదరించకపోతే తెలుగు చిత్రపరిశ్రమలో అంతపెద్ద నటిని కాలేకపోయాను అని అన్నారు. ఈ క్రమంలోనే తన సహనటి దివంగత హీరోయిన్ సౌందర్య మరణాన్ని తలుచుకుని ఎమోషనల్ అయ్యారు ప్రేమ. ఆమెతో కలిసి నటించిన రోజులను గుర్తుచేసుకున్నారు.

Actress Prema : సౌందర్య మృతిని తల్చుకుని ఎమోషనల్ అయిన ప్రేమ.. ఆరోజు జరిగింది అదేనంటూ..
Prema, Soundarya

Updated on: Apr 14, 2023 | 7:06 AM

తెలుగు చిత్రపరిశ్రమలో ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు హీరోయిన్ ప్రేమ. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె.. తెలుగుతోపాటు… కన్నడ, తమిళ్, మలయాలంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. 2017, 22లో రీఎంట్రీ ఇచ్చి ఓ రెండు సినిమాలు చేశారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రేమ… తన జీవితం.. ప్రేమ, పెళ్లి, ఫిల్మ్ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రేక్షకులు ఆదరించకపోతే తెలుగు చిత్రపరిశ్రమలో అంతపెద్ద నటిని కాలేకపోయాను అని అన్నారు. ఈ క్రమంలోనే తన సహనటి దివంగత హీరోయిన్ సౌందర్య మరణాన్ని తలుచుకుని ఎమోషనల్ అయ్యారు ప్రేమ. ఆమెతో కలిసి నటించిన రోజులను గుర్తుచేసుకున్నారు.

“సౌందర్య చనిపోయిన రోజు.. ఇంతేనా జీవితం అనిపించింది. ఇంటికి వెళ్లగానే ఎదురుగా ఆమె బ్రదర్.. సౌందర్య ఫోటోస్ పెట్టి ఉన్నాయి. చూడగానే ఏదోలా అనిపించింది. వాళ్ల బాడీలను బాక్స్ లో పెట్టి ఉంచారు. చూడటానికి కూడా ఫేస్ లేదు. ఇంతేనా ఆర్టిస్ట్ జీవితం అనిపించింది. మనం పోయేటప్పుడు తీసుకెళ్లేది కర్మ. హార్డ్ వర్క్ తప్ప ఏమీ లేదు. ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడిన సౌందర్య అమ్మగారు ఆరోజు ఏంతో ఏడ్చారు. సౌందర్యతో నటించే రోజులు చాలా బాగుండేవి. తను చాలా తక్కువ తినేది. పప్పు, పాలక్, నెయ్యి, గోంగూర పచ్చడి. అవన్నీ తినడం ఆమె దగ్గరే నేర్చుకున్నారు.

నేను అయితే షాట్ ఎప్పుడూ అయిపోతుందా అని వెయిట్ చేసేదాన్ని.. కానీ సౌందర్య మాత్రం ప్రతి షాట్ లో అందంగా కనిపించాలని అనుకునేది. ఎప్పటికప్పుడు మరింత అందంగా కనపడేలా చూసుకోవడం చేసేది. తనతో పనిచేసిన రోజులు ఎప్పటికీ గుర్తొస్తుంటాయి.” అంటూ భావోద్వేగానికి గురయ్యారు ప్రేమ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us