Tollywood:ముఖానికి ఇంత మేకప్పా? ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఎన్టీఆర్‌తోనూ సినిమా చేసింది
తెలుగుతో పాటు తమిళ్, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేసిందీ అందాల తార. అయితే వివిధ కారణాలతో చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోందీ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడీ సీనియర్ నటి సడెన్ గా ఇలా కనిపించి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది.

పై ఫొటోలో ముఖానికి మరీ ఎక్కువ మేకప్ వేసుకున్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు ఫేమస్ హీరోయిన్. తల్లి దిగ్గజ నటి కావడంతో ఈమె కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేసింది. అందం, అభినయం పరంగా తిరుగులేని హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసింది. ఎన్టీఆర్, రాజేంద్ర ప్రసాద్ తదితర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఉన్నట్లుండి ఈ బ్యూటీ సినిమాలకు దూరమైపోయింది. ఆ మధ్యలో నటికి క్యాన్సర్ వచ్చిందని ప్రచారం జరిగింది. చనిపోయిందని రూమర్స్ కూడా వచ్చాయి. అయితే అవన్నీ ఉట్టివే అని తేలిపోయాయి. ఇక నటి చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో ఈమెకు, తండ్రికి మధ్య విభేదాలు తలెత్తాయి. తన కూతురు మానసిక పరిస్థితి సరిగా లేదని తండ్రి కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో తల్ లీకూతురు ఒంటరిగా ఉండేవారు. ఇక తల్లి చనిపోయాక నటి జీవితం మరింత దుర్భరంగా మారింది. ఇల్లు దాటి బయటకు రాకుండా లోపల తాళం వేసుకుని జీవించేది. వివాదాలతోనే జీవితాన్ని గడుపుతోన్న ఈ అందాల తార ఇప్పుడు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. తన మొదటి హీరోను కలుసుకుంది. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. చాలా మంది ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఇదేంటి హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా?
సుమారు రెండున్నర దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నటి కనక తాజాగా తన మొదటి హీరో రామరాజన్‌ను కలిసింది. వీరివెంట ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దరన్ కుమార్ కూడా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ధరన్ ‘ 37 ఏళ్ల తర్వాత రీ యూనియన్’ అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ‘వాట్ ఏ సర్‌ప్రైజ్’ అని క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో కనకకి మేకప్ కొంచెం ఎక్కువైందంటున్నారు.
తన మొదటి హీరోతో నటి కనక..
View this post on Instagram
కాగా కనక.. తెలుగులో ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో యాక్ట్ చేసింది. అలాగే రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన వాలు జడ తోలు బెల్టు సినిమాలోనూ హీరోయిన్ గా నటించింది.
అప్పట్లో నటి కనక..

Actress Kanaka
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




