MAA Elections 2021: “మా” ఎన్నికలు.. సీనియర్లతో జీవితా రాజశేఖర్ సంప్రదింపులు.. సూపర్ స్టార్ కృష్ణ సపోర్ట్ కోరనున్న….

సినీ పరిశ్రమలో ఎన్నికల సందడి మొదలైంది. టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

MAA Elections 2021: మా ఎన్నికలు.. సీనియర్లతో జీవితా రాజశేఖర్ సంప్రదింపులు.. సూపర్ స్టార్ కృష్ణ సపోర్ట్ కోరనున్న....
Maa Elections

Updated on: Jun 26, 2021 | 8:31 AM

సినీ పరిశ్రమలో ఎన్నికల సందడి మొదలైంది. టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రతిసారీ ఇద్దరు మాత్రమే పోటీ పడే ఈ ఎన్నికల్లో ఈసారి నలుగురు కావడంతో.. రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. అయితే ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రాంతీయ బేధం కూడా రాజుకుంది. ఒకరిపై ఒకరు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. చిరంజీవి కుటుంబం అండదండలతో ప్రకాష్ రాజ్ ఎన్నికల బరిలో దిగుతున్నాడు. మరోవైపు కృష్ణ, బాలకృష్ణ లాంటి సీనియర్ నటులు మంచు విష్ణుకు అండగా ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. వితకు ఎవరు ప్రచారం చేస్తారు అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇక సీనియర్ నటి హేమ సంగతి పెద్దగా పట్టించుకున్నట్లు కూడా అనిపించడం లేదు.  అయితే ఇప్పటికీ మా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే.. అభ్యర్థులు సీనియర్ల మద్దతు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

మంచు విష్ణు కోసం సీనియర్ నటుడు మోహన్ బాబు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వారు సూపర్ స్టార్ కృష్ణను కలిసి మద్దతు కోరినట్లుగా తెలుస్తోంది. తాజాగా జీవితా రాజశేఖర్ కూడా ఈరోజు (జూన్ 26న) సూపర్ స్టార్ కృష్ణను ఆయన నివాసంలో కలవనున్నారు. “మా” అధ్యక్షుడు సీనియర్ నటుడు నరేష్.. జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్.. సూపర్ స్టార్ కృష్ణను నానక్ రాం గూడలోని ఆయన నివాసంలో ఉదయం 10 గంటలకు కలవబోతున్నారు. అనంతరం మా ఎన్నికల గురించి ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు.

Also Read: Actor Anupam Kher: నన్ను అందరూ గుర్తిస్తారు అనుకున్నా.. కానీ అతడు నా గర్వాన్ని పూర్తిగా బద్దలు కొట్టేశాడు.. సీనియర్ నటుడి షాకింగ్ కామెంట్స్..

MAA Elections: ఆ అగ్రనటులంతా లోకలా? మీరు ప్రేమించే రాముడు సీత నాన్ లోకల్: రామ్ గోపాల్ వర్మ 

Suresh Raina Biopic: తెర‌పైకి సురేష్ రైనా బ‌యోపిక్‌.. లీడ్ రోల్‌లో న‌టించేదెవ‌రు.. రైనా అభిప్రాయం ఏంటి.?

Megastar Chiranjeevi: నైన్టీస్‌లోనే బాలీవుడ్ మేగజైన్‌ కవర్‌పేజ్ ఎక్కేశారు.. ఆయ‌న‌కు పాన్ ఇండియా ఇమేజ్ ఓ లెక్కా..?