Satyadev: ఛాన్స్ ఇచ్చిన పూరీగారే గుర్తుపట్టలేదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన సత్యదేవ్

|

Dec 13, 2022 | 6:04 AM

రొటీన్ కథలు కాకుండా విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు. అలాగే ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు.

Satyadev: ఛాన్స్ ఇచ్చిన పూరీగారే గుర్తుపట్టలేదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన సత్యదేవ్
Satyadev
Follow us on

వినూత్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు హీరో సత్యదేవ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు హీరోగా ఎదిగాడు. రొటీన్ కథలు కాకుండా విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు. అలాగే ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. అంతే కాదు బాలీవుడ్ లోను సినిమాలు చేస్తున్నాడు ఈ వర్సటైల్ యాక్టర్. ఇటీవలే అక్షయ్ కుమార్ నటించిన రామ సేతు సినిమాలో నటించాడు. తాజాగా గుర్తుందా శీతాకాలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా  మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో సత్యదేవ్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సత్యదేవ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జోతిలక్ష్మీ అనే సినిమాతో హీరోగా మారిన విషయం తెలిసిందే.

తాజాగా సత్యదేవ్ మాట్లాడుతూ.. సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉంది. ఆ ఇంట్రెస్ట్ తోనే జాబ్ మానేశాను. చిన్న చిన్న పాత్రలను చేస్తూ ఇండస్ట్రీకి కంటిన్యూ అయ్యాను. ఆసమయంలోనే పూరి జగన్నాథ్ గారు ‘జ్యోతి లక్ష్మి’ సినిమా ఆడిషన్స్ కి వెళ్లాను. పూరిగారి సినిమాల్లో చేయడానికి హీరోలంతా రెడీగా ఉంటారు. కాబట్టి విలన్ రోల్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని అనుకున్నాను. ఇక నేను ఇచ్చిన ఆడిషన్ ఆయనకు నచ్చింది. అప్పుడు నేను 90కేజీలు ఉన్నాను.

పూరిజగన్నాథ్ సినిమాలో విలన్ కాస్త హ్యాండ్సమ్ గా ఉంటాడేమో అనుకుని బరువు తగ్గాను. ఏకంగా 16 కేజీల వరకూ బరువు తగ్గాను. అప్పుడు వెళ్లి ఆయనకి కనిపిస్తే నన్ను గుర్తుపట్టలేదు. ‘ఇదేంటి పేషంట్ లా తయారవ్వు?’ అన్నారు. అప్పుడు చెప్పను ఆయన తీస్తున్న సినిమాలో నేనే హీరోనని. అప్పుడు మళ్లీ బరువు పెరగాల్సి వచ్చింది. ఇలా పూరిగారి దగ్గరకు విలన్ పాత్రకోసం వెళ్లి హీరో అయ్యాను అని అన్నారు సత్యదేవ్.

ఇవి కూడా చదవండి