Sarkaru Vaari Paata Pre Release Highlights: అంగరంగా వైభవంగా సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్..

|

May 07, 2022 | 10:29 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్..

Sarkaru Vaari Paata Pre Release Highlights: అంగరంగా వైభవంగా సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్..
Sarkaru Vaari Paata

Mahesh Babu Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట సినిమా ఇక థియేటర్లలో సందడి చేయనుంది. డైరెక్టర్ పరశురామ్.. మహేష్ కాంబోలో రాబోతున్న ఈ మూవీపై అంచనాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి.. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సైతం మరింత హైప్ క్రియేట్ చేసింది. ఓవైపు యూట్యూబ్‏లో ఈ మూవీ సాంగ్స్ మిలియన్స్ వ్యూస్‏తో దూసుకుపోతుండగా.. మరోవైపు సర్కారు వారి పాట రిలీజ్ సందడి షూరు అయ్యింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్.. మే 7న అంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్‏లో సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రీరిలీజ్ ఈవెంట్ వద్దకు మహేష్ ఫ్యాన్స్ తరలివచ్చారు.

సర్కారు వారి పాట మరిన్ని అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..  

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 May 2022 10:25 PM (IST)

    డైరెక్టర్ పరశురామ్ కామెంట్స్..

    డైరెక్టర్ కొరటాల శివ గారి వల్లే మహేష్ బాబు గారికి కథ చెప్పగలిగాను.. నన్ను నమ్మి ఈ ఛాన్స్ ఇచ్చినందుకు సూపర్ మహేష్ బాబుకు థ్యాంక్స్… డైరెక్టర్ పరశురామ్..

  • 07 May 2022 10:13 PM (IST)

    మా అబ్బాయి నటించాడు.. యంగ్ హీరో సుధీర్..

    యంగ్ హీరో సుధీర్ మాట్లాడుతూ.. సర్కారు వారి పాట సినిమాలో మా అబ్బాయి దర్శన్ నటించాడు.. చిన్నప్పటి మహేష్ బాబు పాత్రలో మా అబ్బాయి దర్శన్ నటించాడని చెప్పుకొచ్చారు.

  • 07 May 2022 10:10 PM (IST)

    వింటేజ్ మాహేష్ అంటే ఒప్పుకోను.. యంగ్ హీరో సుదీర్..

    పాన్ ఇండియా పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ మహేష్ విషయంలో పాన్ ఆడియన్స్ అనే పదం వాడాలి అనుకుంటున్నన్నారు యంగ్ హీరో సుదీర్.

  • 07 May 2022 10:07 PM (IST)

    సూపర్ స్టార్ కంటే ముందు మీ సూపర్ స్టార్.. గల్లా అశోక్..

    ట్రైలర్, పాటలతోనే అర్థమవుతుంది సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్ . యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో గల్లా అశోక్..

  • 07 May 2022 09:56 PM (IST)

    డైరక్టర్ బుచ్చిబాబు సన కామెంట్స్..

    అబ్బాయిలు కూడా అందంగా ఉంటారని మిమ్మల్ని చూడగానే తెలిసిపోయింది.. ఇప్పటివరకు అమ్మాయిలే అందంగా ఉంటారనుకున్నా.. డైరెక్టర్ బుచ్చిబాబు సన..

  • 07 May 2022 09:49 PM (IST)

    సర్కారు వారి పాట బిగ్గెస్ట్ సక్సెస్.. అనిల్ రావిపూడి..

    మహేష్ బాబు కెరీర్‏లో సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్. అంతకు మించి హిట్ అవుతుంది సర్కారు వారి పాట సినిమా అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

  • 07 May 2022 09:42 PM (IST)

    నా పొట్ట కొడుతున్నారు.. సుమ కామెంట్స్..

    ఇటీవల అన్ని ఇంటర్వ్యూలు డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసేస్తున్నారు.. నా పొట్ట కొడుతున్నారు అంటూ సరదా కామెంట్స్ చేశారు యాంకర్ సుమ.

  • 07 May 2022 09:21 PM (IST)

    సర్కారు వారి ప్రీ రిలీజ్ ఈవెంట్..

    సినిమాలోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్‏తో కలిపి పెన్నీ పాటను మరోసారి అద్బుతంగా ఆలపించారు సింగర్ నకాష్ ఆజీజ్..

  • 07 May 2022 09:11 PM (IST)

    సర్కారు వారి ప్రీ రిలీజ్ ఈవెంట్..

    సూపర్ హిట్ సాంగ్ కళావతి పాటను అద్భుతంగా ఆలపించిన సింగర్ సాకేత్..

  • 07 May 2022 08:59 PM (IST)

    కళావతి పాటతోనే హీరోయిన్ పాత్రకు పేరొచ్చింది.. తమన్.

    కళావతి ట్యూన్ వినిపించగానే సూపర్ స్టార్ మహేష్ గారు 100 మార్క్స్ ఇచ్చేశారు.. కళావతి పాటతోనే సినిమాలో కళావతి పేరు పెట్టేశారన్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్.

  • 07 May 2022 08:53 PM (IST)

    మహేష్ బాబు ఇప్పటివరకు ఇలా చూడలేదు..సుకుమార్..

    మహేష్ బాబును ఇప్పటివరకు ఇంత జోష్‏ఫుల్ గా చూడలేదు. మీతోపాటు సినిమా చూడటానికి ఆసక్తిగా ఉన్నానన్నారు డైరెక్టర్ సుకుమార్. సెట్‏లో డైరెక్టర్స్ అందరికీ మహేష్ చాలా రెస్పెక్ట్ ఇస్తారు.. సర్కారు వారి పాట సినిమా పెద్ద సూపర్ హిట్ అవుతుందన్నారు సుకుమార్.

  • 07 May 2022 08:47 PM (IST)

    మా.. మా.. మహేష్ మాస్ సాంగ్..

    డైరెక్టర్ సుకుమార్ మా.. మా.. మహేష్ మాస్ సాంగ్‏ను లాంచ్ చేశారు. తాజాగా విడుదలైన మాస్ బీట్‏లో మహేష్.. కీర్తిసురేష్ మరింత కలర్‏ఫుల్‏గా కనిపిస్తూ.. స్టెప్పులతో అదరగొట్టారు.

  • 07 May 2022 08:43 PM (IST)

    స్పెషల్ వీడియో..

    ఆంధ్ర హాస్పిటల్స్‏ వారి ఆధ్వర్యంలో ఇప్పటికీ వందలాది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి..ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు సూపర్ స్టార్ మహేష్.

  • 07 May 2022 08:37 PM (IST)

    కళావతి వచ్చేసింది..

    హీరోయిన్ కీర్తి సురేష్.. సిల్వర్ షైన్ చీరలో ఎల్లోరా శిల్పంలా ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ కళావతి పాత్రలో నటిస్తుంది.

  • 07 May 2022 08:34 PM (IST)

    మహేష్ చాలా కష్టపడ్డారు.. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్మణ్..

    ప్రేక్షకులను మెప్పించేందుకు ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం మహేష్ చాలా కష్టపడ్డారన్నారు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్మణ్..

  • 07 May 2022 08:28 PM (IST)

    డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథి..

    సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు సక్సెస్ ఫుల్ డైరెక్ట్ర సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

  • 07 May 2022 08:22 PM (IST)

    గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్..

    స్టన్నింగ్ లుక్‏లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు..

  • 07 May 2022 08:17 PM (IST)

    మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎంట్రీ.

    అద్భుతమైన మ్యూజిక్‏తో మహేష్ ఫ్యాన్స్‏కు అదిరిపోయే సాంగ్స్ అందించాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. కాసేపటి క్రితమే సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్దకు వచ్చారు.

  • 07 May 2022 08:12 PM (IST)

    డైరెక్టర్ పరశురామ్ ఎంట్రీ..

    సక్సెస్ పుల్ డైరెక్టర్ పరశురామ్.. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్మణ్ లు ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక వద్దకు విచ్చేశారు.

  • 07 May 2022 08:08 PM (IST)

    సర్కారు వారి పాట సాంగ్స్ అదుర్స్..

    ఇప్పటివరకు విడుదలైన సర్కారు వారి పాట టైటిల్ సాంగ్.. కళావతి…పెన్నీ సాంగ్స్ యూట్యూబ్‏లో రికార్డ్స్ క్రియేట్ చేశాయి. అతి తక్కువ సమయంలో మిలియన్ వ్యూస్ సాధించి సంచలం సృష్టించాయి. తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ శ్రోతలను మెస్మరైజ్ చేసింది.

  • 07 May 2022 07:54 PM (IST)

    మహేష్ డైలాగ్స్‏తో సుమ సందడి..

    సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు యాంకర్ సుమ హోస్ట్‏గా వ్యవహరిస్తున్నారు. మహేష్ బాబు డైలాగ్స్‏తో అభిమానులకు మరింత ఉత్సాహా పరుస్తున్నారు యాంకర్ సుమ.

  • 07 May 2022 07:50 PM (IST)

    అభిమానులకు మహేష్ బాబు లేఖ..

    సర్కారు వారి పాట సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మహేష్ బాబు స్పెషల్ లెటర్ పోస్ట్ చేశారు. ఈ సినిమాను చూసి థియేటర్లలో చూసి స్పందన తెలపాలని..అలాగే..త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న SSMB 28 షూటింగ్ జూన్‏లో స్టార్ట్ కానున్నట్లు తెలిపారు.

  • 07 May 2022 07:34 PM (IST)

    కోలాహలంగా మారిన యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్..

    సూపర్ స్టార్ మహేష్ బాబును చూసేందుకు భారీగా అభిమానులు ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక వద్దకు చేరుకున్నారు.. మహేష్ బాబు సూపర్ డూపర్ హిట్ అంటూ నినాదాలతో హోరెత్తిపోతుంది యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్.

  • 07 May 2022 07:31 PM (IST)

    సర్కారు వారి పాట సినిమాకు అందరు కనెక్ట్ అవుతారు..

    సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్. మహేష్ బాబు గారి లుక్స్, ప్రజంటేషన్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని.. సర్కారు వారి పాట సినిమా అందరికీ కనెక్ట్ అవుతారని తెలిపారు డైరెక్టర్ పరశురామ్..

  • 07 May 2022 07:19 PM (IST)

    మొదటి సారిగా సిల్వర్ స్క్రీన్ పై మహేష్ గారాలపట్టి..

    ఇటీవల విడుదలైన పెన్నీ సాంగ్‏కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట ద్వారా మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని సిల్వర్ స్క్రీన్‏కి తొలిసారిగా పరిచయం అయింది. ఈ పాట తండ్రీ-కూతురు ద్వయం అందమైన డ్యాన్స్‏తో రూపొందింది. సితార రాకింగ్ స్టెప్పులతో అదరగొట్టింది.

  • 07 May 2022 07:09 PM (IST)

    రికార్డ్ క్రియేట్ చేస్తోన్న కళావతి సాంగ్..

    సర్కారు వారి పాట నుంచి ఇటీవల విడుదలైన కళావతి సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు 150 పైగా మిలియన్ వ్యూస్ సాధించి రికార్డుకెక్కింది. అనంత శ్రీరామ్ రచించిన ఈ పాటకు తమన్ సంగీతం అందించగా.. సిద్‌ శ్రీరామ్‌ అద్భుతంగా ఆలపించాడు. ఈ పాటలో మహేష్.. కీర్తి సురేష్ కెమిస్ట్రీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది.

  • 07 May 2022 06:59 PM (IST)

    మహేష్ పాటలతో ఫుల్ జోరు..

    సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు ఇప్పటికే భారీగా అభిమానులు.. ప్రముఖులు తరలివచ్చారు. మహేష్ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్స్‏తో అభిమానులను మరింత ఉత్సాహపరుస్తున్నారు సింగర్స్.

  • 07 May 2022 06:48 PM (IST)

    మహేష్ బాబు బ్యాంక్ ఉద్యోగి కాదు.. డైరెక్టర్..

    సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ ఎంప్లాయి కాదని.. అలాగే ఈ కథలో ఒక వ్యక్తి గురించి కానీ వ్యవస్థని ప్రశ్నించడం కానీ వుండదని.. మంచి ఉద్దేశంతో రాసుకున్న కథ అని.. సరదా ఉంటూ చెప్పాల్సింది బలంగా చెప్పే కథని క్లారిటీ ఇచ్చేశారు డైరెక్టర్ పరశురామ్.

  • 07 May 2022 06:33 PM (IST)

    భారీగా పోలీసుల మోహారింపు..

    సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడి మొదలైంది. మహేష్ సినిమా అభిమానులకు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబును చూసేందుకు భారీగా అభిమానుల తరలివస్తున్నారు. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్ద భారీగా పోలీసుల మోహారింపు.

  • 07 May 2022 06:22 PM (IST)

    మహేష్ ఫ్యాన్స్‏కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..

    సర్కారు వారి పాట సినిమా విడుదల నేపథ్యంలో మహేష్ అభిమానులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ అందించింది. ఈ సినిమాకు 10 రోజులపాటు రూ. 45 టికెట్ ధరను పెంచుకోవచ్చని తెలియజేసింది.

  • 07 May 2022 06:13 PM (IST)

    ట్రైలర్‏తో మరింత హైప్..

    ఇప్పటికే విడుదలైన సర్కారు వారి పాట ట్రైలర్ సినిమాపై భారీ హైప్ తెచ్చింది. ఇందులో మహేష్ హ్యండ్సమ్ లుక్.. డైలాగ్స్ అదుర్స్ అనిపించాయి. అలాగే పెన్నీ, కళావతి సాంగ్స్ యూట్యూబ్‏లో రికార్డ్ స్తాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది.

  • 07 May 2022 05:59 PM (IST)

    సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్..

    సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్ వద్ద ఫ్యాన్స్ సందడి షూరు అయ్యింది. ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తోన్న సర్కారు వారి పాట విడుదల కాబోతుండడంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్‏లో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుంటున్నారు.

Follow us on