బాలీవుడ్ లో మ‌స్త్ ఆఫ‌ర్ ప‌ట్టిన‌ శ్వేతాబసు ప్రసాద్..

తెలుగులో 'కొత్త బంగారులోకం సినిమా'తో ఊహించ‌ని క్రేజ్ ద‌క్కించుకుంది శ్వేతాబసు ప్రసాద్. ఆ త‌ర్వాత ఆమె దక్షిణాది భాష‌ల్లో చేసిన సినిమాల పెద్ద‌గా విజ‌య‌వంతం కాలేదు.

బాలీవుడ్ లో మ‌స్త్ ఆఫ‌ర్ ప‌ట్టిన‌ శ్వేతాబసు ప్రసాద్..

Updated on: Jul 23, 2020 | 11:52 PM

తెలుగులో ‘కొత్త బంగారులోకం సినిమా’తో ఊహించ‌ని క్రేజ్ ద‌క్కించుకుంది శ్వేతాబసు ప్రసాద్. ఆ త‌ర్వాత ఆమె దక్షిణాది భాష‌ల్లో చేసిన సినిమాల పెద్ద‌గా విజ‌య‌వంతం కాలేదు. ప్ర‌స్తుతం ఈ భామ‌ బాలీవుడ్​లో వ‌రుస‌ ఆఫర్లు దక్కించుకుంటోంది. 2017 నుంచి సంవ‌త్స‌రానికి ఓ మూవీ చొప్పున చేస్తోంది. అంతేకాకుండా వెబ్​ సిరీస్​ల్లోనూ న‌టిస్తోంది. తాజాగా ‘కామెడీ కపుల్’​ అనే చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

ఇందులో హిందీ నటుడు షకీబ్ సలీంతో కలిసి శ్వేతా ఆడిపాడ‌నుంది. రొమాన్స్​, కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీని నచికేత్​ సమంత్​ డైరెక్ట్ చేస్తున్నాడు. జీ5 సార‌థ్యంలో, యోడ్లే ఫిల్మ్స్​ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. దర్శకుడు నచికేత్​ గతంలో మరాఠీ సినిమాలు ‘గచ్చీ’, ‘హబడ్డీ’, ‘గుడ్​ బడ్డీ గడ్బడీ’ తెరకెక్కించాడు. అయితే ‘కామెడీ కపుల్​’ ద్వారా బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

ప్రస్తుతం శ్వేత.. ‘డాక్టర్​.డాన్​’ అనే వెబ్​సిరీస్​లోనూ యాక్ట్ చేస్తోంది. ఇందులో ఆమె రేఖ అనే లాయర్ పాత్ర పోషిస్తోంది. షకీబ్​ చివరిగా సల్మాన్​ నటించిన ‘రేస్​-3’, కబీర్​ఖాన్​ స్పోర్ట్స్​ డ్రామా ’83’లోనూ న‌టించాడు.