Ooru Peru Bhairavakona: డేట్ మారింది తప్ప సంకల్పం మారలేదు.. ‘ఊరు పేరు భైరవకోన’ కొత్త రిలీజ్ డేట్..

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. దీంతో ఈ మూవీని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు అడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు మేకర్స్. ఇక అందుకు తగినట్లుగానే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. కానీ అదే రోజున మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఒకే రోజున ఈ రెండు సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. కానీ అంతకు ముందు

Ooru Peru Bhairavakona: డేట్ మారింది తప్ప సంకల్పం మారలేదు.. ఊరు పేరు భైరవకోన కొత్త రిలీజ్ డేట్..
Ooru Peru Bhairavakona Collections

Updated on: Jan 30, 2024 | 6:33 PM

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ సినిమా ‘ఊరు పేరు భైరవకోన’. ఇందులో వర్ష బొలమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. దీంతో ఈ మూవీని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు అడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు మేకర్స్. ఇక అందుకు తగినట్లుగానే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. కానీ అదే రోజున మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఒకే రోజున ఈ రెండు సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. కానీ అంతకు ముందు ఈగల్ చిత్రబృందానికి సింగిల్ రిలీజ్ డేట్ ఇస్తామని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించడంతో.. అదే విషయాన్ని చర్చిస్తూ నిర్మాతల మండలికి లేఖ రాసింది ఈగల్ టీం. దీంతో ఈ విషయం పై తాజాగా ఫిల్మ్ ఛాంబర్ లో చర్చించారు. ఈ క్రమంలోనే ఊరు పేరు భైరవకోన సినిమా వెనక్కు తగ్గింది.

తమ సినిమాను ఫిబ్రవరి 9న కాకుండా 16న రిలీజ్ చేయనున్నట్లు కాసేపటి క్రితం చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సందీప్ కిషన్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులో సందీప్ మంత్రదండం పట్టుకుని కనిపించాడు. అతడి వెనకాలే వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ నిల్చున్నారు. “తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ సూచనని మన్నిస్తూ ఊరు పేరు భైరవకోన సినిమాను ఫిబ్రవరి 16కి వాయిదా వేస్తున్నాం. డేట్ మారింది తప్ప సంకల్పం మారలేదు” వాలెంటైన్స్ డేకి పెయిడ్ ప్రీమియర్స్ తో భారీ సక్సెస్ సెలబ్రెషన్ చేసుకుందాం” అంటూ రాసుకొచ్చాడు సందీప్.

రవితేజ నటించిన ఈగల్ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ ఆ సమయంలో ఏకంగా నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. దీంతో థియేటర్లు సర్దుబాటు కష్టమవుతుందని నిర్మాతల మండలి విజ్ఞప్తి చేయడంతో ఈగల్ సినిమాను వాయిదా వేశారు మేకర్స్. అయితే ఫిబ్రవరి 9న రవితేజ సినిమాకు సోలో డేట్ వచ్చేలా చూస్తామని చెప్పడంతో ఈగల్ సినిమా రిలీజ్ చేయలేదు. ఇక ఆ తర్వాత ఊరుపేరు భైరవకోన కూడా అదే రోజున విడుదలవుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ విషయాన్ని పరిశీలించాలని కోరుతూ ఓ లేఖ రాసింది ఈగల్ నిర్మాణ సంస్థ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.