Sana Khan: అందుకే సినిమా ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పాను.. షాకింగ్‌ విషయాలను బయటపెట్టిన సనాఖాన్

Sana Khan: కల్యాణ్‌ రామ్‌ కత్తి, గగనం, మిస్టర్‌ నూకయ్య తదితర సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది సనాఖాన్‌ (Sana Khan). తన అందం, అభినయంతో తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ పాపులారిటీ

Sana Khan: అందుకే సినిమా ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పాను.. షాకింగ్‌ విషయాలను బయటపెట్టిన సనాఖాన్
Sana Khan

Updated on: Jul 28, 2022 | 8:38 PM

Sana Khan: కల్యాణ్‌ రామ్‌ కత్తి, గగనం, మిస్టర్‌ నూకయ్య తదితర సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది సనాఖాన్‌ (Sana Khan). తన అందం, అభినయంతో తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ పాపులారిటీ సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌ లాంటి సూపర్‌ స్టార్లతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకుంది. సినిమాలు, టీవీషోల్లో నటిస్తూ బిజీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ 2020లో హఠాత్తుగా ఎంటర్‌టైన్మెంట్‌ రంగానికి వీడ్కోలు పలికింది. అదే ఏడాది ముఫ్తీ అనాస్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. అయితే ఆమె ఉన్నట్లుండి సినిమా రంగానికి ఎందుకు దూరమైందో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సనా.. తాను ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పడం వెనకనున్న కారణాలపై నోరువిప్పింది.

అసలు జీవితమంటే అదే!

ఇవి కూడా చదవండి

‘నాజీవితంలో పేరు, కీర్తి, ధనం అన్నీ ఉన్నాయి. వీటితో నేను ఏమైనా చేయగలను. అయితే నా మనసులో ప్రశాంతత లేదు. నాకు అన్నీ ఉన్నప్పటికీ నేను ఎందుకు ఆనందంగా లేను? అనే విషయం అసలు అర్థం కాలేదు. దీంతో నా మనసులో ఒక విధమైన అలజడి రేగింది. చాలా రోజుల పాటు నిరాశలో మునిగిపోయాను. అయితే అప్పుడే నాకు కొన్ని సంకేతాలు అందాయి. ముఖ్యంగా 2019 రంజాన్‌ సమయంలో నాకు కలలో ఒక సమాధి కనిపించింది. అది బాగా మండుతోంది. అందులో నాకు నేనే కన్పించాను. నా జీవితాన్ని మార్చుకోకపోతే నా అంతం ఇదే అని దేవుడు నాకు ఇస్తున్న ఓ సంకేతంగా నేను భావించాను. దీంతో నా లైఫ్‌స్టైల్‌ను పూర్తిగా మార్చుకున్నాను. పలు ఇస్లాం ప్రసంగాలు విని ప్రేరణ పొందాను. ఈ జన్మ డబ్బు, కీర్తి ప్రతిష్ఠలు సంపాదించడానికి మాత్రమే కాదు. అవసరమైనవారికి సహాయం చేయడమే జీవితం పరమార్థం అని తెలుకున్నాను’ అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడింది సనాఖాన్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us