Sampoornesh Babu Bazaar Rowdy First Look: ‘హృదయ కాలేయం’ సినిమాతో కామెడీకి సరికొత్త అర్థం చెబుతూ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు హీరో సంపూర్ణేష్ బాబు. ఈ సినిమాలో స్ఫూఫ్ కామెడీని ఓ రేంజ్‌లో పండించిన సంపూ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు.
ఇక అనంతరం వచ్చిన ‘సింగం 123’, ‘కొబ్బరి మట్ట’ సినిమాలతో ప్రేక్షకులను మరోసారి నవ్వించాడు. ఈ రెండు సినిమాల తర్వాత సంపూర్ణేష్ బాబు సుధీర్ఘ విరామం తీసుకున్నాడు. సుమారు రెండేళ్ల గ్యాప్ తర్వాత సంపూర్ణేష్ బాబు ‘బజార్ రౌడి’ పేరుతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్నాడు. అయితే ఈసారి కాస్త యాక్షన్ కూడా ఉండేలా చూసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. హైదరాబాద్ చార్మినర్‌ను చూపిస్తూ మొదలైన మోషన్ పోస్టర్, ఆ తర్వాత మెట్రోరైల్‌ను.. చివరికి రసూల్ పూరలోని రౌడీలను చూపించారు. ఇక అక్కడే ఓ మంచంపై సిగిరెట్ వెలిగిస్తూ ఉన్న సంపూర్ణేష్ ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది. మోషన్ పోస్టర్‌ను గమనిస్తే ఈ సినిమా హైదరాబాద్ రౌడీయిజం నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమాకు వసంత నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తుండగా.. కేఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సందిరెడ్డి శ్రీనివాస్ రావు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలో సంపూర్ణేష్ బాబు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. మరి రౌడీయిజంతో కామెడీ పండించాలని చూస్తోన్న సంపూ.. ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటాడో చూడాలి.
First Look & Motion Poster of BURNING STAR sampoornesh’s #BazarRowdy #SandhireddySrinivasaRao #VasantaNageswaraRao #SekharAlvalapati #SaiKarthik pic.twitter.com/yV042wYDja
— Movie Updates (@popcorn553) February 10, 2021
Also Read: Rashmika Mandanna: రష్మిక మిషన్ మజ్ను సినిమా షూటింగ్ షురూ.. వైరల్ అవుతున్న మొదటిరోజు ఫొటో..