నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా వుండదు అనేది యాపిల్ బ్యూటీ గతంలోనే ఇచ్చిన స్వీట్ వార్నింగ్. ఎంజాయ్‌మెంటే కాదు… అంతకుమించి అంటూ కొత్తకొత్త హెచ్చరికలు జారీ ఔతున్నాయిప్పుడు. రిలీజ్ డేట్స్ విషయంలో కూడా హీరోలకు క్లాష్ ఇస్తూ… వార్తల్లో నిలుస్తున్నారు సమంత(Samantha). ఓ బేబీ రిటర్న్ అయ్యేదెప్పుడు, రామలక్ష్మి ఫ్లేవర్స్ మళ్లీమళ్లీ చూడలేమా అని బెంగ పెట్టుకున్న ప్యాన్స్‌కీ, ఆడియన్స్‌కి ఊ అంటావా ఊహూ అంటావా అంటూ స్పెషల్ సాంగ్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చారు సమంత. ఇకనుంచి కొత్త వెర్షన్ చూస్తారన్న హింట్ కూడా అక్కడే కనిపించింది. కిట్టీలో కావల్సినన్ని క్రేజీ ప్రాజెక్టులున్నా సామ్ నుంచి సోలో పెర్ఫామెన్స్ కోసం ఆడియన్స్‌లో వెయిటింగ్ తప్పలేదు. ఆ వెలితి తీర్చడానికే అన్నట్టు యశోద మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. కానీ ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఉంది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్టుతో జోరు మీదున్న అఖిల్ నెక్స్ట్ మూవీ ఏజెంట్. ఈ పాన్ ఇండియా మూవీ రిలీజయ్యే ఆగస్టు12వ తేదీనే సమంత సోలో సినిమా రాబోతోంది. దాంతో సమంత , అఖిల్ సినిమాలు క్లాష్ అవ్వనున్నాయి.. అయితే ఈ రెండు సినిమాల పై మంచి బజ్ ఉంది. మరి ఈ రెండు సినిమాల్లో ఎవరు వెనక్కి తగ్గుతారో చూడలి. ఇక విడాకుల తర్వాత చైతూ కెరీర్‌లో దూసుకెళుతుంటే… సమంత కూడా తన గ్రాఫ్‌ని గట్టిపర్చుకునే పనిలో బిజీ అయ్యారు. లేటెస్ట్‌గా ముంబైలో తన కాల్షీట్స్ డీల్ చేసేందుకు కొత్త మేనేజర్‌ని ఎపాయింట్ చేసుకున్నారు. ఆమె చేసిన శాకుంతలం, ఖతీజా సినిమాలు కమింగ్ సూన్ అంటున్నాయి. హాలీవుడ్ మూవీ ప్రోగ్రెస్‌లో వుంది. ఇలా కొత్త మజిలీతో అక్కినేని ఫ్యామిలీని ఇన్‌డైరెక్ట్‌గా ఎటాక్ చేస్తున్నారు సమంత.
మరిన్ని ఇక్కడ చదవండి :