
సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘మా ఇంటి బంగారం’. గతంలో సామ్ తోనే జబర్దస్త్ , ఓ బేబీ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన నందిని రెడ్డి ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. శుక్రవారం (జూన్ 19) రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజే ఏకంగా రూ. 13 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక శనివారం (జూన్ 20) కూడా వీకెండ్ కావడంతో సామ్ సినిమా కలెక్షన్లు మరింత పెరిగాయి. ఓవరాల్ గా ఈ రెండు రోజులకు కలిపి మా ఇంటి బంగారం సినిమాకు రూ. 28 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అంటే శనివారం ఒక్కరోజే సామ్ సినిమాకు రూ. 15 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక ఆదివారం (జూన్ 21) కూడా హాలీడే కావడంతో మా ఇంటి బంగారం సినిమా కలెక్షన్లు మరింత పెరగ వచ్చని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ‘మా ఇంటి బంగారం’ కు సాలిడ్ కలెక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా రికార్డ్ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్లు వన్ మిలియన్ డాలర్ మార్క్ కు చేరువగా ఉన్నాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా మా ఇంటి బంగారం సినిమాను నిర్మించారు. సుమారు రూ. 30 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సమంతతో పాటు శ్రీనివాస గవిరెడ్డి, మంజూష, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమీ, ఆనంద్, లక్ష్మీ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించగా, .ఓం ప్రకాష్ సినిమాటోగ్రాఫర్‌గా ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌గా వర్క్ చేశారు.
Bangaaram’s Rachcha at the box office 🔥🔥#MaaIntiBangaaram collects a gross of 28 CRORES WORLDWIDE IN 2 DAYS ❤🔥
Watch the BLOCKBUSTER 𝐒𝐀𝐌BHAVAM #MaaIntiBangaaram in theatres today ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/P89ifZn9Ss@TralalaPictures… pic.twitter.com/Cxb5KDXYCM— Tralala Moving Pictures (@TralalaPictures) June 21, 2026
Utthama Kodalu Turning Theatres Into Festivals 🔥✨#MaaIntiBangaaram NORTH AMERICA GROSS $700K+ and Counting 💥
BLOCKBUSTER 𝐒𝐀𝐌BHAVAM #MIB In Cinemas Now ❤️🔥
Overseas By @PrathyangiraUS@Samanthaprabhu2 #RajNidimoru #NandiniReddy @TralalaPictures @himankd @gulshandevaiah… pic.twitter.com/ZCbicLT2ai
— Prathyangira Cinemas (@PrathyangiraUS) June 20, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.