అక్కినేని నాగచైతన్య-సమంత జంట వైవాహిక బంధానికి ఎండ్ కార్డ్ పడింది. తాము ఇద్దరం విడిపోతున్నట్లు ఇరువురు సామాజిక మాధ్యమాల వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఎంతో చర్చించి ఆలోచించుకున్నాకే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 2017లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం గోవాలో ఒక్కటైన ఈ జంట.. ‘ఏం మాయ చేశావే’, ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’, ‘మజిలి’ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా పేరున్న చెయ్-సామ్ జంట విడిపోవడం అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. కానీ ఎక్కవకాలం కలిసి ప్రయాణం చేయకపోవడం మాత్రం చాలామందిని నిరాశపరిచిన అంశమనే చెప్పాలి. అయితే ఈ జంట జీవిత భాగస్వాములుగా విడిపోయినా.. స్నేహితులుగా ఉండబోతున్నారని వారి పోస్ట్‌ని బట్టి అర్థమయ్యింది. అందుకు తగ్గట్టుగానే ఇరువురి సోషల్ మీడియా ఖాతాల్లో ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో పోస్టులు అలాగే ఉన్నాయి. దీంతో వారు ఫ్యూచర్‌లో ఫ్రెండ్స్‌గా కంటిన్యూ అవ్వబోతున్నారని అర్థమవుతోంది. ఇది కొంచెం వారి అభిమానులకు ఊరట కలిగించే అంశమే.
విడిపోడానికి సరైన కారణాన్ని వెల్లడించని చైతన్య, సమంత.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమ వ్యక్తిగత స్వేచ్ఛకు అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌లో తమ స్నేహ బంధం కొనసాగుతుందని తెలిపారు.
Also Read: విడాకుల ప్రకటన అనంతరం గుండె నిండా బాధతో సంచలన స్టేటస్ పెట్టిన సమంత
విడాకులకు ముందుగానే చేతిపై సామ్ టాటూను చెరిపివేసిన నాగ చైతన్య