Samantha Deletes divorce statement from Instagram: టాలీవుడ్ (Tollywood) మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ సామ్ – చైతూ (Chay – Sam) గతేడాది అక్టోబర్ 2న విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక విడాకుల విషయం సోషల్ మీడియాలో ఇరువురూ పంచుకున్నారు కూడా. దీనితో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. అప్పటి నుంచి సామ్, చైతూ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ప్రకంపనలు పుట్టిస్తూనేవున్నాయి. కాగా తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి నాగ చైతన్య నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన (విడాకుల ప్రకటన) పోస్టును తొలగించింది. మరోవైపు సమంత, నాగ చైతన్యతో కలిసి కుటుంబాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు శకుంతలం నిర్మాత నీలిమా గుణ గతంలో వెల్లడించారు. అందుకే గతేడాది సినిమా ఆఫర్ ను వదులుకున్నట్లు నీలిమా తెలిపారు. ఈ సంకేతాలన్నీ చూస్తుంటే చై, సామ్ మళ్లీ కలువబోతున్నారేమోననే సందేహాలు, మరెన్నో ప్రశ్నలు అభిమానుల బుర్రలు తొలుస్తున్నాయి.
కాగా గతంలో కూడా సోషల్ మీడియాలో తాము విడిపోతున్నట్లు ఇద్దరు ప్రకటించిన తర్వాత, దాదాపు నాగ చైతన్యకు సంబంధించిన అన్ని చిత్రాలను సమంత తొలగించింది. వివాహ వేడుకలు, విహార యాత్రల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న అనేక చిత్రాలను తొలగించింది. స్పెయిన్, ఆమ్ స్టర్ డామ్ ట్రిప్పులకు సంబంధించిన చిత్రాలు, అలాగే దగ్గుబాటి రానా వివాహానికి సంబంధించిన చిత్రాలు, క్రిస్మస్ వేడుకలు మొదలైన చిత్రాలను సోషల్ మీడియా నుంచి తొలగించింది. ఇక సామ్ ప్రస్తుతం కాత్తువాక్కుల రెండు కాదల్, యశోద చిత్రాలతోపాటు, గుణశేఖర్ శాకుంతలం సినిమాలతో బిజీగా ఉంది. అమీర్ ఖాన్ ’లాల్ సింగ్ చద్దా‘ చిత్రంలో చై కనిపించనున్నాడు.
Also Read: