ప్రేమమ్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సాయి పల్లవి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ చిన్నది. ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇటీవలే అమరన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సాయి పల్లవి మరోసారి తన నటనతో కట్టిపడేసింది. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ అమరన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో సాయి పల్లవి స్టార్ డమ్ మరింత పెరిగింది.
ఇక ఇప్పుడు హిందీలోకి కూడా అడుగుపెడుతుంది. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ రామాయణం లో సీతగా సాయి పల్లవి నటించనుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది. ఆ మధ్య సాయి పల్లవి , రణబీర్ కపూర్ ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే తెలుగులో ఈ చిన్నది తండేల్ అనే సినిమా చేస్తుంది. తండేల్ మూవీలో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతుంది.
గతంలో నాగచైతన్య , సాయి పల్లవి కాంబినేషన్ లో లవ్ స్టోరీ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి పల్లవి మరో ఇంట్రెస్టింగ్ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. బలగం సినిమాతో దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న వేణు ఎల్దండి దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా రానుంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తున్నాడని తెలుస్తుంది. ముందుగా ఈ మూవీలో నాని హీరో అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆఛాన్స్ నితిన్ కు వెళ్లిందని తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని సెలక్ట్ చేసుకున్నారని తెలుస్తుంది. సాయి పల్లవి తెలంగాణ అమ్మాయిగా అద్భుతంగా సెట్ అవుతుంది. ఫిదా, లవ్ స్టోరీ సినిమాల్లో అచ్చం తెలంగాణ అమ్మాయిలా నటించి మెప్పించింది. దాంతో సాయి పల్లవి అయితే ఈ సినిమాకు కరెక్ట్ గా సెట్ అవుతుందని దర్శక నిర్మాతలు భావించి ఆమెను ఎంపిక చేశారని తెలుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి