Sai Dharam Tej: సాయి ధరమ్ యాక్సిడెంట్‌పై నరేష్ వ్యాఖ్యలపై వివాదం.. ఎప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో అంటూ బండ్ల గణేష్ ఫైర్

Sai Dharam Tej Accident: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై సీనియర్ నరేష్ స్పందిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పందించారు. సాయి ధరమ్ తేజ్ కు.. ..

Sai Dharam Tej: సాయి ధరమ్ యాక్సిడెంట్‌పై నరేష్ వ్యాఖ్యలపై వివాదం.. ఎప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో అంటూ బండ్ల గణేష్ ఫైర్
Teju Ganesh

Updated on: Sep 11, 2021 | 8:45 PM

Sai Dharam Tej Accident: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై సీనియర్ నరేష్ స్పందిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పందించారు. సాయి ధరమ్ తేజ్ కు జరిగింది చిన్న ప్రమాదం.. సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి తిరిగి వస్తాడు. త్వరలోనే షూటింగ్స్ లో పాల్గొంటాడని బండ్ల గణేష్ చెప్పాడు. అంతేకాదు.. నరేష్ కు ఎప్పుడు ఏ సమయంలో ఏమి మాట్లాడాలో తెలియదంటూ ఫైర్ అయ్యాడు.  నరేష్ ఈ టైం లో ప్రమాదంలో చనిపోయిన వాళ్ల పేర్లు చెప్పడం..  సరికాదని అన్నాడు. ఇక సాయి ధరమ్ తేజ్ ప్రమాదం జరగడానికి ముందు మా ఇంటికి కొచ్చాడు రేసింగ్ లు చేశారు అనేవి ఇప్పుడెందుకు చెప్పాలి.. అసలు ఎప్పుడు ఏ సందర్భంలో ఏమి మాట్లాడాలో ముందు నేర్చుకోండి అంటూ నరేష్  హితవు పలికారు. పరమేశ్వరుని దయ వల్ల త్వరగా సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలంటూ బండ్ల గణేష్ ఆకాంక్షించాడు.

ఇక  రోడ్డు ప్రమాదం ప్రమాదం జరగడానికి ముందు సాయి ధరమ్ తేజ్ తన ఇంటి నుంచే బయలుదేరాడని నటుడు నరేశ్ తెలిపారు. తన కుమారుడు నవీన్ విజయ్ కృష్ణకు సాయితేజ్ మంచి స్నేహితుడని చెప్పారు. సాయి వేగంగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని దేవుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు నరేశ్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

 

Also Read:  తేజు మీదనే కాదు.. మున్సిపాలిటీపై, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీపై కూడా కేసుపెట్టమంటున్న మ్యూజిక్ డైరెక్టర్..