Sai Dharam Tej: సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనున్న సాయి ధరమ్ తేజ్.. మెగా మేనల్లుడి సడెన్‌ డెసిషన్‌కు కారణమిదే

|

Jul 18, 2023 | 9:21 PM

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. సుమారు ఆరు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించాడు. తన ఆరోగ్యంపై దృష్టి సారించే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని, అభిమానులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు మెగా మేనల్లుడు తెలిపాడు.

Sai Dharam Tej: సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనున్న సాయి ధరమ్ తేజ్.. మెగా మేనల్లుడి సడెన్‌ డెసిషన్‌కు కారణమిదే
Sai Dharam Tej
Follow us on

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. సుమారు ఆరు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించాడు. తన ఆరోగ్యంపై దృష్టి సారించే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని, అభిమానులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు మెగా మేనల్లుడు తెలిపాడు. కాగా బైక్‌ ప్రమాదంలో సాయి ధరమ్‌ తేజ్‌ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని నెలల పాటు సినిమాలకు దూరమయ్యాడీ మెగా హీరో. ఆ తర్వాత కోలుకుని విరూపాక్ష సినిమాలో చేశాడు. ఇది ఏకంగా వందకోట్ల క్లబ్‌లో చేరింది. ఆ తర్వాత మేనమామ పవన్‌ కల్యాణ్‌తో కలిసి బ్రో సినిమాలో నటించాడు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 28న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్‌, గ్లింప్స్‌, సాంగ్స్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈక్రమంలో బ్రో మూవీ ప్రమోషన్లలో పాల్గొన్నసాయి ధరమ్ తేజ్‌ సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకుంటున్నట్లు తెలిపాడు.

‘నా ఆరోగ్యంపై మరింత దృష్టి సారించాలనుకుంటున్నాను. ఇందుకోసం ఆరు నెలల పాటు సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకుంటున్నాను నా తర్వాతి సినిమాలకు 100 శాతం ఎఫర్ట్‌ పెట్టేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నాను. అభిమానులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. నేనో చిన్న శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉంది. పూర్తిగా కోలుకోవడానికి సుమారు ఆరు నెలలు పట్టొచ్చు’ అని తేజ్‌ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.