RRR: జపాన్‌లో తుఫాన్ సృష్టిస్తోన్న ఆర్ఆర్ఆర్.. మన తెలుగు సినిమాకు మరో రికార్డు

|

Nov 22, 2022 | 6:35 AM

ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటించిన ఈ సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

RRR: జపాన్‌లో తుఫాన్ సృష్టిస్తోన్న ఆర్ఆర్ఆర్.. మన తెలుగు సినిమాకు మరో రికార్డు
Rrr
Follow us on

టాలీవుడ్ లో ఇటీవల సంచలనం  సృష్టించిన సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా ఒకటి. జక్కన్న చెక్కిన ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొట్టిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటించిన ఈ సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇటీవలే ఈ సినిమాను  జపాన్ లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమా సమయంలో రాజమౌళి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ ను కంటిన్యూ చేస్తూ ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల సూపర్ హిట్  గా నిలిచింది. ఇక జపాన్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమా అక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది.

ఇక జపాన్ లో సినిమాను రిలీజ్ చేసే ముందు కాస్త గట్టిగానే ప్రమోషన్స్ చేశారు ఆర్ఆర్ఆర్ టీమ్. హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పాటు దర్శకుడు రాజమౌళి కూడా జపాన్ వెళ్లి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అక్కడి అభిమానులు చరణ్, తారక్ లకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ లోను కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే అక్కడ విడుదలైన ఇండియన్ సినిమాలన్నింటిలో టాప్ మూవీగా నిలిచింది. తాజాగా 2 మిలియన్ వసూళ్లను దాటి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది ఆర్ఆర్ఆర్ మూవీ. జపాన్ లో విడుదలైన సౌత్ సినిమాలన్నింటిలో నెంబర్ వన్ గా నిలవడమే కాకుండా భారీ వసూళ్లను రాబడుతోంది మన ఆర్ఆర్ఆర్.

ఇవి కూడా చదవండి