
తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించారు.అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్, అజయ్ దేవ్ గణ్, సముద్రఖని, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సీతారామరాజు, భీమ్ అనే ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కల్పిత నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2022 మార్చి 25న విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ. 1300 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది. అంతేకాదు ఆస్కార్ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు కూడా గెల్చుకుంది. కాగా ఇదే సినిమాలో మల్లి అనే ఓ చిన్నారి పాత్ర బాగా హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా ‘కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా..అమ్మ ఒళ్లో నేను రోజూ ఊగాలా’ అనే పాటలో ఆ చిన్నారి పలికించిన ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగుంటాయి. నిజం చెప్పాలంటే ఈ ఆర్ఆర్ఆర్ సినిమా కథనే ఆ గోండు జాతి పిల్లతో మొదలవుతోంది. బ్రిటిష్ అధికారుల చేతిలో చిక్కుకున్న ఆ చిన్నారిని విడిపించేందుకు భీమ్ చేసే ప్రయత్నాలే ఈ సినిమా కథాంశం. మరి మల్లి పాత్రలో నటించిన ఆ అమ్మాయి ఎవరు? ఇప్పుడెలా ఉందో తెలుసుకుందాం రండి.
ఈ పాప అసలు పేరు ట్వింకిల్ శర్మ. ఛత్తీస్ గఢ్ లోనే పుట్టి పెరిగింది. ఆమెకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఆసక్తితోనే పలు డ్యాన్స్ రియాలిటీ షోల్లో పాల్గొని సత్తా చాటింది. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్‌లోనూ మెరిసింది ట్వింకిల్. అలాగే పలు ప్రకటనల్లోనూ యాక్ట్ చేసింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ప్లిఫ్ కార్ట్ యాడ్ లో ట్వింకిల్ శర్మను చూసిన రాజమౌళి ఆర్ ఆర్ఆర్ మూవీకి తనను తీసుకున్నారట.
ఆర్ఆర్ఆర్ సినిమాలో చిన్న పిల్లలా కనిపించింది ట్వింకిల్ శర్మ. అయితే ఇప్పుడు మాత్రం బాగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ఎలాంటి సినిమాలు చేయడం లేదని తెలుస్తోంది. అలాగే ఉన్నత చదువులపై దృష్టి సారించిందని తెలుస్తోంది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది ట్వింకిల్. తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. మరి ఇప్పటికే నెట్టింట ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ట్వింకిల్ శర్మ భవిష్యత్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి