కేజీఎఫ్(K.G.F) సినిమా సృష్టించిన సంచలనం గురించి అవసరం లేదు.. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయినా కేజీఎఫ్.. అన్నిభాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. బాహుబలితో మొదలైన పాన్ ఇండియా హవాను కేజీఎఫ్ సినిమా మరింత ముందుకు తీసుకెళ్లింది. ఈ ఒక్క సినిమాతో రాకింగ్ స్టార్ యశ్(Yash) అన్నిభాషల్లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు యశ్ చాలా దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు కేజేఎఫ్ పార్ట్ 2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న కేజీఎఫ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పార్ట్ 2.. పార్ట్ 1 కు మించి ఉంటుందని అంటున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌లోని డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో యశ్ చెప్పిన డైలాగ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్రయూనిట్. ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనెల 14న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా యూఎస్ వసూళ్లు కాస్త ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు కేజీఎఫ్ 2 కోసం భారీ ఎత్తున హైప్ క్రియేట్ అయ్యింది. ఇటీవల పాన్ ఇండియా సినిమాలకు యూఎస్ లో మంచి వసూళ్లు దక్కుతున్నాయి. ముఖ్యంగా అక్కడ తెలుగు సినిమాకు మంచి క్రేజ్ ఉంది. దాంతో కేజీఎఫ్ తెలుగు వర్షన్ కు యూఎస్ లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కేజీఎఫ్ 2 కోసం అక్కడ భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ జరిగిందట. ప్రీమియర్ షో లతో పాటు రెగ్యులర్ షో ల కోసం యూఎస్ లో పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ జరుగగా అందులో మెజార్టీ తెలుగు ప్రేక్షకులే అంటున్నారు. ఇటీవల వచ్చిన రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలకు యూఎస్ లో భారీ వసూళ్లు దక్కిన విషయం తెలిసిందే. దాంతో కేజీఎఫ్ సినిమా యూఎస్ వసూళ్ళలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం కన్ఫామ్ గా కనిపిస్తుంది. చూడాలి మరి ఏంజరుగుతుందో..
మరిన్ని ఇక్కడ చదవండి :