చిరంజీవితో కలిసి నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా? అయ్యబాబోయ్! గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..
మెగాస్టార్ చిరంజీవి, సౌందర్య హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'చూడాలని వుంది'. గుణశేఖర్ దర్శకత్వంలో 1998లో వచ్చిన ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా..
మెగాస్టార్ చిరంజీవి, సౌందర్య హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చూడాలని వుంది’. గుణశేఖర్ దర్శకత్వంలో 1998లో వచ్చిన ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది అంజలా జవేరి. ఈమె పేరుకు ఆ మూవీ సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ.. తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వాస్తవానికి ఈ బ్యూటీ విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ‘చూడాలని వుంది’, ‘సమరసింహారెడ్డి’, ‘రావోయి చందమామ’, ‘దేవిపుత్రుడు’, ‘ప్రేమ సందడి’ లాంటి చిత్రాలతో విజయాలు దక్కించుకుని తనకంటూ అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించింది. అలాగే సీనియర్ హీరోలందరితోనూ జతకట్టి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.
ఇక తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించిన అంజలా జవేరి.. కెరీర్ పీక్ స్టేజిలో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. మరి ఆమె పెళ్లాడిన వ్యక్తి మరెవరో కాదు బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో స్టైలిష్ విలన్‌గా తనదైన శైలి నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. కాగా, 2012లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో అంజలా జవేరి చివరిసారిగా కనిపించింది. అలాగే అంజలా జవేరి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆమె భర్త తరుణ్ అరోరా తెలిపారు. ఆమెకు తగ్గ పాత్ర వస్తే వెంటనే ఓకే చెబుతుందని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు.
View this post on Instagram
View this post on Instagram