Siya Guatam: పెళ్లిపీటలెక్కిన రవితేజ ‘నేనింతే’ హీరోయిన్‌.. హాజరైన ప్రియమణి దంపతులు.. ఫొటోలు వైరల్‌

|

Feb 07, 2023 | 1:44 PM

అప్పుడప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తోన్న శియా గౌతమ్ తాజాగా ఓ తీపికబురు పంచుకుంది. తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. సోమవారం శియా గౌతమ్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆమె భర్త పేరు నికిల్ పాల్కేవాలా.

Siya Guatam: పెళ్లిపీటలెక్కిన రవితేజ నేనింతే హీరోయిన్‌.. హాజరైన ప్రియమణి దంపతులు.. ఫొటోలు వైరల్‌
Siya Gautam Marriage
Follow us on

2008లో రవితేజ హీరోగా నటించిన ‘నేనింతే’ సినిమాతో తెలుగు నాట అడుగుపెట్టింది ముంబై ముద్దుగుమ్మ శియా గౌతమ్‌ అలియాస్‌ అదితి గౌతమ్‌. ఆ సినిమాలో ఆమె అందానికి, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఎందుకోగానీ హీరోయిన్‌గా కెరీర్‌ కొనసాగించలేకపోయింది. క్రిష్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ‘వేదం’ చిత్రంలో మనోజ్‌ బాజ్‌పేయ్‌ భార్యగా నటించింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. అయితే కన్నడలో డబుల్‌ డెక్కర్‌ అనే సినిమాలో కనిపించిన ఆమె రణ్‌బీర్‌ కపూర్‌ సంజూ సినిమాతో హిందీ నాట తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. సినిమా సూపర్‌ హిట్‌ అయినా శియాకు మాత్రం ఛాన్స్‌లు రాలేదు. దీంతో సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. అయితే సుదీర్ఘ విరామం తర్వాత గోపిచంద్‌ నటించిన పక్కా కమర్షియల్‌ సినిమాలో ఓ చిన్న పాత్రను పోషించింది. అప్పుడప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తోన్న శియా గౌతమ్ తాజాగా ఓ తీపికబురు పంచుకుంది. తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. సోమవారం శియా గౌతమ్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆమె భర్త పేరు నికిల్ పాల్కేవాలా. ప్రియమణి, ఆమె భర్తతో పాటు మరికొంత మంది నటీనటులు శియా- నికిల్‌ల వివాహానికి హాజరయ్యారు. నూతన దంపతులకు అభినందనలు తెలిపారు.

కాగా పెళ్లి వేడుకతో పాటు సంగీత్, మెహందీ వేడుకలకు సంబంధించిన వీడియోలను శియా తర ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు. దీంతో ఆమె పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు, అభిమానులు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి