Ravi Teja: రవితేజ ‘ఈగల్’ సినిమా పై రూమర్స్.. ఖండించిన మేకర్స్..

ఇక ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఈగల్. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. చాలా రోజులుగా ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డే్ట్ రాలేదు. ఈ క్రమంలోనే ఈగల్ రిలీజ్ వాయిదా పడిందంటూ రూమర్స్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. కొన్ని కారణాలతో ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నారని.

Ravi Teja: రవితేజ ఈగల్ సినిమా పై రూమర్స్..  ఖండించిన మేకర్స్..
Raviteja

Updated on: Nov 01, 2023 | 5:18 PM

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు మాస్ మాహారాజా రవితేజ. దసరా సందర్భంగా టైగర్ నాగేశ్వర రావు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ అందుకున్నాడు. స్టూవర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా డైరెక్టర్ వంశీ రూపొందించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదలై మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఈగల్. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. చాలా రోజులుగా ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డే్ట్ రాలేదు. ఈ క్రమంలోనే ఈగల్ రిలీజ్ వాయిదా పడిందంటూ రూమర్స్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. కొన్ని కారణాలతో ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నారని.. జనవరి 26న విడుదలయ్యే అవకాశాలున్నాయని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నారు.

తాజాగా ఈ రూమర్స్ పై చిత్రయూనిట్ స్పందించింది. ఈగల్ మూవీ రిలీజ్ డేట్ గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని.. ముందుగా అనుకున్న తేదీకే ఈ సినిమా విడుదలవుతుందని స్పష్టం చేసింది. ఈ చిత్రాన్ని యాక్షన్ కథాంశంతో తెరకెక్కిస్తుండగా.. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో నవదీప్, మధుబాల కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతోపాటు.. ఇటీవలే మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు రవితేజ. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరోసారి మాస్ మాహారాజ నటించనున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతికి ఈగల్ తోపాటు.. మహేష్ బాబు నటిస్తోన్న గుంటూర కారం, వెంకటేశ్ నటిస్తోన్న సైంధవ్, విజయ్ దేవరకొండ నటిస్తోన్న ఫ్యామిలీ స్టార్, నాగార్జున నటిస్తోన్న నా సామిరంగ, యంగ్ హీరో తేజ నటిస్తోన్న హనుమాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.