Ramarao On Duty: సిల్వర్‌స్ర్కీన్‌పైనే స్టెప్పులేసే సినిమా తారలు నేడు పబ్లిక్ స్టేజ్‌లపై కూడా డ్యాన్సులు చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్ ఏవైనా తమదైన శైలిలో స్టెప్పులేస్తూ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో భాగంగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు తమన్‌తో కలిసి స్టె్ప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆతర్వాత ఎఫ్3 సక్సెస్ మీట్‌లో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇలా చిత్రబృందమంతా డ్యాన్స్ చేసింది. ఆ మధ్యన అంటే సుందరానికి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని, నజ్రియానే కాకుండా మూవీ యూనిట్ అంతా స్టెప్పులేసి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఈ కోవలోకి మాస్ మహారాజా రవితేజ (Raviteja) కూడా చేరారు. తాజాగా జరిగిన రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన తన గత సినిమాల్లోని ఐకానిక్ స్టెప్పులను రీక్రియేట్ చేసి తన అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపారు.
Song vachi 20 yrs ina craze em matram thaggaledhu ????
Mass energy ❤️??⚡⚡⚡??? ఇవి కూడా చదవండి@RaviTeja_offl#RamaRaoOnDuty pic.twitter.com/jkGaiLbR3Z
— HÁRẞHÆ- on duty July 29th ? (@Harsha_offll) July 25, 2022
కాగా ఈ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన సుమ కనకాల ఇడియట్, విక్రమార్కుడు సినిమాల్లోని పాటలకు డ్యాన్స్ చేయమని రవితేజను కోరగా.. అక్కడే ఉన్న హీరోయిన్లతో కలిసి ఆయన కాలు కదిపారు. ముఖ్యంగా ఇడియట్ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘ చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే ‘ అంటూ మాస్ మహారాజా వేసిన డ్యాన్స్‌కి అందరూ ఫిదా అయిపోయారు. అలాగే విక్రమార్కుడు సినిమాలోని చింతాత పాటకు కూడా అదరిపోయే స్టెప్పులేశారు మాస్ మహారాజా. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘పాటొచ్చి 20 ఏళ్లు అయ్యింది. అయినా రవితేజలో ఏ మాత్రం ఎనర్జీ తగ్గలేదు. అదే క్రేజ్’, ఆయన ఎనర్జీని ఎవరూ మ్యాచ్ చేయలేరు’ అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఖిలాడీ తర్వాత రవితేజ నటిస్తోన్న చిత్రం రామారావు ఆన్‌డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో దివ్యాంశ, రజిషా హీరోయిన్లుగా కనిపించనున్నారు. వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 29న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
The energy is matchless ?
The Jinthata Chitha Chitha moment from the #RamaRaoOnDuty Pre Release Event ❤️?@RaviTeja_offl @directorsarat @Divyanshaaaaaa @rajisha_vijayan @SamCSmusic @RTTeamWorks @SLVCinemasOffl pic.twitter.com/rPo0Crrvac
— ??????? ?? ???? ? (@RamaraoOnDuty) July 24, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..