Ramarao on Duty: మాస్ రాజా సినిమాను వదలని లీక్ రాయుళ్లు.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి వీడియో..

టాలీవుడ్ ను వదలని లీకుల బెడద.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సినిమా షూటింగ్ నుంచి ఎదో ఒకటి లీక్ అవుతూనే ఉన్నాయి.

Ramarao on Duty: మాస్ రాజా సినిమాను వదలని లీక్ రాయుళ్లు.. 'రామారావు ఆన్ డ్యూటీ' నుంచి వీడియో..
Raviteja
Follow us

|

Updated on: Jul 28, 2022 | 3:24 PM

టాలీవుడ్‌ను వదలని లీకుల బెడద.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సినిమా షూటింగ్ నుంచి ఎదో ఒకటి లీక్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మాస్ మహారాజ రవితేజ సినిమా నుంచి లీక్ అయిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ(Ramarao on Duty)అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల వరుస ఫ్లాప్‌లు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ సినిమా పై గట్టి ధీమాతో ఉన్నారు మాస్ రాజా. అయితే ఇప్పుడు రవితేజ విలన్స్‌కు వార్నింగ్ ఇస్తోన్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవ్వడంతో చిత్రయూనిట్ షాక్ కు గురైంది.

20 సెకన్లు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. “అధికారం ఉంది కదా అని.. కొండలు తోడేస్తా.. అడ్డంగా భూములు దోచేద్దాం అనుకుంటే”.. అంటూ రవితేజ వార్నింగ్ ఇస్తున్న డైలాగ్ చూస్తుంటే సినిమాలో కొంచెం పొలిటికల్ టచ్ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. రవితేజ ఈ సినిమాలో విభిన్నమైన రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డైలాగ్ లీక్ కావడం టాక్ ఆఫ్ ది రీల్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి