Ravi Teja ART Multiplex: రవితేజ మల్టీఫ్లెక్స్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌.. మొదటి సినిమా ఏదంటే?

మాస్ మహారాజా రవి తేజ మల్టీ ప్లెక్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు.హైదరాబాద్ లోని వనస్థలిపురంలో అతను నిర్మించిన ఏఆర్ టీ మల్టీ ప్లెక్స్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మల్టీప్లెక్స్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Ravi Teja ART Multiplex: రవితేజ మల్టీఫ్లెక్స్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌.. మొదటి సినిమా ఏదంటే?
Ravi Teja ART Multiplex

Updated on: Jul 29, 2025 | 6:14 PM

ఏఎంబీ సినిమాస్ తో మహేష్ బాబు, ఏఏఏ సినిమాస్ తో అల్లు అర్జున్ హైదరాబాద్ లో మల్టీ ప్లెక్స్ లు ఏర్పాటు చేశారు. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా ఏవీడీ సినిమాస్ పేరుతో మల్టీ ప్లెక్స్ ను ఏర్పాటు చేశాడు. త్వరలోనే ఏపీలోనూ ఈ స్టార్ హీరోల మల్టీ ప్లెక్స్ లు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడీ మల్టీ ప్లెక్స్ బిజినెస్ లోకి మాస్ మహరాజా రవితేజ కూడా అడుగు పెట్టాడు. ఏషియన్‌ సినిమాస్‌ వారి భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో ART (ఏషియ‌న్ ర‌వితేజ) పేరుతో ఓ లగ్జరీ మల్టీ ప్లెక్స్ ను నిర్మించాడు రవితేజ. మొత్తం ఆరు స్క్రీన్లతో వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం బుధవారం ( జులై 30)న జరగనుందని తెలుస్తోంది. హీరో రవితేజతో పాటు పలువురు స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.

కాగా ఏఆర్ టీ మల్టీప్లెక్స్ లో తొలి సినిమాగా విజయ్ దేవరకొండ కింగ్ డమ్ ను ప్రదర్శించనున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రవితేజ థియేటర్‌లో కింగ్ డమ్ మొదటి సినిమా కావడంతో విజయ్‌ దేవరకొండ అభిమానులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలో హీరోలిద్దరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్ డమ్ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటించింది. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

రవితేజ మల్టీ ప్లెక్స్ థియేటర్ ఫొటోస్ ఇదిగో..

అత్యాధునిక సదుపాయాలతో..

కాగా ఈస్ట్‌ హైదరాబాద్‌ ఏరియాలో అత్యంత లగ్జరీ థియేటర్‌గా రవితేజ మల్టీప్లెక్స్ నిలవనుంది. సుమారు 60 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్.. ఆపై డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఈ మల్టీ ప్లెక్స్ రెడీ అయ్యింది. ఇప్పటికే టెస్టింగ్ ప్రక్రియ కూడా పూర్తి అయింది.

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాతో ఓపెనింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.