Ravi Teja: ఆ హీరోయిన్ నా సినిమాలకు డేట్స్‌ ఇస్తుందో లేదో.. రవితేజ ఆసక్తికర కామెంట్స్

|

Dec 20, 2022 | 9:57 AM

ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్, ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న 'ధమాకా' ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపథ్యంలో..

Ravi Teja: ఆ హీరోయిన్ నా సినిమాలకు డేట్స్‌ ఇస్తుందో లేదో.. రవితేజ ఆసక్తికర కామెంట్స్
Raviteja
Follow us on

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ధమాకా. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్, ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న ‘ధమాకా’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపథ్యంలో ధమాకా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

రవితేజ మాట్లాడుతూ.. ధమాకా సినిమా ఖచ్చితంగా బావుంటుంది. మా టీం అంతా చాలా నమ్మకంగా వున్నాం. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, కెమరామెన్ కార్తిక్ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. శేఖర్, జానీ, యశ్వంత్ సాంగ్స్ చాలా చక్కగా కొరియోగ్రఫీ చేశారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ యాక్షన్ అదరగొట్టారు. ప్రసన్న హ్యుమర్ నాకు చాలా ఇష్టం. ధమాకా అద్భుతంగా రాశాడు. ”ఇఫ్ ఐ సీ ఎ విలన్ ఇన్ యు, యు విల్ సీ ఎ హీరో ఇన్ మీ’ ఇందులో నాకు ఇష్టమైన డైలాగ్. దర్శకుడు త్రినాథరావు ఇరగదీశారు. పాత చిత్రాల్లో రావు గోపాలరావు- అల్లు రామలింగయ్య కాంబినేషన్‌ లా ‘ధమాకా’ లో రావు రమేష్, ఆది ల కాంబో సరదాగా ఉంటుంది అన్నారు.

శ్రీలీల రెండో సినిమాకే జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. అందంతో పాటు తనలో చాలా ప్రతిభ వుంది. నెక్స్ట్ ఇయర్ కి నెక్స్ట్ లెవల్ కి వెళుతుంది. నా మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆమె నా సినిమాలకు డేట్స్‌ ఇస్తుందో లేదో అన్నారు నవ్వుతూ.. భీమ్స్ కూడా ధమాకా తో నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడు. నన్ను ద్రుష్టిలో పెట్టుకునే మ్యూజిక్ చేసినట్లువుంది. ఒకొక్క పాట ఇరగదీశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు చాలా పాజిటివ్ గా వుంటారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏ ముహూర్తాన పెట్టారో గానీ అదో ఫ్యాక్టరీ అయిపొయింది. ఈ సంస్థలో నేను సినిమాలు చేస్తానే వుంటాను. విశ్వ ప్రసాద్, వివేక్ గారికి ఆల్ ది బెస్ట్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నెక్స్ట్ లెవల్ వెళ్లాలని కోరుకుంటున్నాను. అభిషేక్ అగర్వాల్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాలు తీస్తారు. ధమాకాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. డిసెంబర్ 23న థియేటర్స్ లో కలుద్దాం” అని అన్నారు రవితేజ.

ఇవి కూడా చదవండి