నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ఇప్పుడి ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రష్మికకు బాగా కలిసొచ్చింది. పుష్ప ఎఫెక్ట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రష్మికకు ఆఫర్స్ క్యూ కట్టాయి. అయితే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఖాతాలో మరో హిట్ వచ్చి చేరింది. అదే యానిమల్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీలో గీతాంజలి పాత్రలో కనిపించింది రష్మిక. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ జోడిగా నటించి మెప్పించింది. ప్రస్తుతం పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ సినిమాల్లో నటిస్తుంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే త్వరలోనే యానిమల్ పార్క్ పట్టాలెక్కనుంది. ఇందులోనూ రష్మిక కనిపించనుంది.
చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న రష్మికకు.. ఇంకా మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ బ్యూటీకి మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరనస రష్మిక నటించనున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిట్. గతంలోనే ఈ మూవీ అఫీషియల్ అనౌన్మెంట్ వచ్చింది. కానీ ఇంకా పట్టాలెక్కలేదు. ఈ మూవీపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. యానిమల్ సినిమాతో రణబీర్ కపూర్ ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా చూపించిన సందీప్.. ఇప్పుడు డార్లింగ్ ను ఎలా చూపిస్తారనే ఆసక్తి మాత్రం అందరిలో నెలకొంది.
ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం స్పిరిట్ సినిమాలో రష్మిక మందన్నా కథానాయికగా నటించనుందట. ఆమెను సంప్రదించే ఆలోచనలో ఉన్నారట సందీప్. ఈ విషయమై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రలో తన సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది రష్మిక. దీంతో ఇప్పుడు మరోసారి స్పిరిట్ మూవీకి ఆమెను ఎంపిక చేయాలని భావిస్తున్నారట. అయితే మొదటిసారి రష్మిక, ప్రభాస్ కలిసి నటించబోతున్నారనే వార్తలు బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.