
ప్రస్తుతం పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో వార్ 2 ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ చిత్రంలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. ఇటీవల తారక్ బర్త్ డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్ మూవీపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాతోపాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా ప్రచారం నడుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా డ్రాగన్ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ టాక్ నడుస్తుంది. అదెంటంటే.. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందట. ఇక ఈ పాటలో ఎన్టీఆర్ తో కలిసి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా స్టె్ప్పులేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సాంగ్ కోసం ఆమెను సంప్రదించాడని.. రష్మిక కూడా ఈ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఈ పాట సినిమాకే హైలెట్ కానుందని.. సెకండ్ హాఫ్ లో వస్తుందని సమాచారం. మొదటిసారి ఎన్టీఆర్, రష్మిక మందన్నా ఇద్దరి కాంబోలో రాబోయే ఈ పాటకు థియేటర్లు షేక్ అవ్వడం ఖాయమని అంటున్నారు. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరీ ఈ ప్రచారంలో నిజం ఎంతవరకు ఉందో చూడాలి.
డ్రాగన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ యాక్షన్ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో తారక్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ సరసన సప్త సాగరాలు దాటి మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్ నటించనుంది.
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..