Rashmika Mandanna: ఇంట్లో ఆ విషయం గురించి అస్సలు మాట్లాడను.. ఎందుకంటే.. రష్మిక కామెంట్స్..

Updated on: Dec 04, 2025 | 2:17 PM

పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ అంటే ఠక్కున గుర్తొచ్చే హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదుంది ఈ అమ్మడు. ఇటీవలే ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో మరో విజయాన్ని అందుకున్న రష్మిక.. తాజాగా ఓ హాలీవుడ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

1 / 5
టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. ఇటీవలే ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో హిట్టు అందుకుంది రష్మిక. ఇప్పుడు హిందీ, తెలుగులో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, పర్సనల్ విషయాలు పంచుకుంది.

2 / 5
ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండతో పెళ్లంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ రూమర్స్ పై స్పందించిన రష్మిక.. ప్రస్తుతం తాను ఈ విషయం గురించి స్పందించాలని అనుకోవడం లేదని.. సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని తెలిపింది.

3 / 5
అలాగే తాను ఇంట్లో తన వర్క్ గురించి అస్సలు మాట్లాడనని తెలిపింది. వర్క్ విషయం లేదా వ్యాపారంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే తన ఇంట్లో మాట్లాడి సహాయం లేదా సలహా తీసుకుంటానని చెప్పుకొచ్చింది. లేకపోతే ఇంట్లో పని గురించి మాట్లాడటం తనకు అస్సలు ఇష్టం లేదని తెలిపింది.

4 / 5
సెట్ లో ఉన్నప్పుడు 100 శాతం తన ఎఫర్ట్స్ ఇస్తానని.. కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అసలు తన వర్క్ గురించి ఆలోచించనని తెలిపింది. “నా వ్యక్తిగత జీవితాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాను. నేను ఇంట్లో పని గురించి మాట్లాడను. సెట్స్ కు వచ్చినప్పుడు మాత్రమే నా పని గురించి మాట్లాడతాను” అని తెలిపింది.

5 / 5
“మనం నటీనటులం.. పని అనేది ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టదు. ఇప్పుడిప్పుడే నేను నా పనిలో వీకెండ్స్ సెలవులు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రతిదీ సరిగ్గా ప్లాన్ చేసుకుంటాను. సినిమాలు, ఈవెంట్స్ అంటూ నేను డబుల్ షిఫ్టులు చేస్తూనే ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది.