Rashmika Mandanna: బాబోయ్.. రష్మిక ఏందమ్మా ఈ రక్తపాతం.. అంచనాలు పెంచేసిన మైసా ఫస్ట్ గ్లింప్స్..

Mysaa Glimpse Video: హీరోయిన్లు ఇప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్నారు. కేవలం గ్లామర్ పాత్రలు కాదు.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోపాటు.. ఛాలెంజింగ్ రూల్స్ చేసేందుకు సై అంటున్నారు. యాక్షన్ పాత్రలతో అదరగొట్టేస్తున్నారు. ఇప్పటికే వరుస హిట్లతో జోష్ మీదున్న రష్మిక.. ఇప్పుడు మరో పవర్ ఫుల్ పాత్రతో అడియన్స్ ముందుకు రాబోతుంది.

Rashmika Mandanna: బాబోయ్.. రష్మిక ఏందమ్మా ఈ రక్తపాతం.. అంచనాలు పెంచేసిన మైసా ఫస్ట్ గ్లింప్స్..
Mysaa

Updated on: Dec 24, 2025 | 1:59 PM

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు మస్త్ జోరు మీదున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఈ ముద్దుగుమ్మ నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తుంది. తెలుగు, హిందీ భాషలలో అటు హిట్స్.. ఇటు ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ అమ్మడు. ఇటీవలే ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు మైసా సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రస్తుతం రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ మైసా. డైరెక్టర్ రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ యాక్షన్ చిత్రంపై మంచి క్యూరియాసిటీ నెలకొంది. ఈ సినిమాతోనే రవీంద్ర పుల్లె దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన మైసా ఫస్ట్ గ్లింప్స్ అంచనాలను పెంచేసింది. బ్యాక్ గ్రౌండ్ లో డైలాగ్స్ తోపాటు.. రష్మిక పాత్రను పరిచయం చేశాడు డైరెక్టర్. “నా బిడ్డ ఊపిరి మోయలేక అగ్గే బూడిదైంది.. నా బిడ్డను సంపలేక.. ఆఖరికి సావే సచ్చిపోయింది” అంటూ వచ్చే డైలాగ్స్ మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రతీకారం తీర్చుకునే మైసా పాత్రలో రష్మిక నటిస్తున్నట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. ఇందులో రష్మిక రక్తంతో తడిసిన గన్ పట్టుకుని తనపైకి వచ్చేవాళ్లను చంపుతున్నట్లు చూపించారు. ఇందులో రష్మిక పవర్ పుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్ పై అత్యధిక భారీ బడ్జెట్ తో అజయ్, అనిల్ సయ్యపురెడ్డిలు నిర్మిస్తున్నారు. ఈసినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే ఇందులో నటించే నటీనటుల వివరాలను ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి :  Bigg Boss 9 Telugu : ఆ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కళ్యాణ్.. తనూజ గురించి ఆసక్తికర కామెంట్స్..