ఇప్పుడు ఎక్కడ చూసిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరే వినిపిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ దూసుకుపోతోంది రష్మిక. టాలీవుడ్ లో ఛలో సినిమాతో పరిచయం అయిన ఈ భామ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ రాణించింది. అలాగే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు కోసం చాలా గట్టిగానే ప్రయత్నిస్తోంది ఈ క్యూటీ. సినిమాలతోనే కాదు కంట్రీవర్సీ కామెంట్స్ తో కూడా రష్మిక హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతినిండా సినిమాలతో గడిపేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రశ్మికకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే రష్మిక భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన వారసుడు సినిమా కోసం రష్మిక 4 కోట్ల వరకు అందుకుంది టాక్.
అయితే ఇప్పుడు ఈ అమ్మడు తన డిమాండ్ ను మరింత పెంచేసిందని తెలుస్తోంది. ఇక పై రష్మిక సినిమా కమిట్ అవ్వాలంటే 6 కోట్ల పైనే రెమ్యునరేషన్ ఉండాలట. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ ను బట్టి 6 కోట్లకు పైనే డిమాండ్ చేస్తుందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా చేస్తోంది. అలాగే నితిన్ , వెంకీ కుడుముల కాంబినేషన్ లో సినిమా చేస్తోంది. వీటితో పాటు రీసెంట్ గా దేవ్ మోహన్ హీరోగా చేస్తోన్న సినిమాలోనూ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.