Pushpa 2: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ప: ది రైజ్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్‌డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రెండో పార్ట్ పుష్ప: ది రూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమా షెడ్యూల్‌కు సంబంధించి రష్మిక ఓ కీలక అప్డేట్ ఇచ్చింది. మరో రెండురోజుల్లో పుష్ప సీక్వెల్ షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గుడ్‌బై (Good Bye). బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.
కాగా ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న రష్మిక పలు ఆసక్తికర కామెంట్లు చేసింది. ‘మీ జీవితంలో ఏ విషయానికి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు’ అని ఓ విలేకరి అడగ్గా.. ‘నెగెటివ్ ఆలోచనలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను’ అని సమాధానమిచ్చింది. ‘నేను చాలా పాజిటివ్ పర్సన్‌ని. దేన్నైనా సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాను. మనందరం కూడా నెగిటివిటీకి గుడ్ బై చెప్పాలి. ఈ ప్రపంచమంతా పాజిటివ్ నెస్‌తో నిండిపోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని చెప్పుకొచ్చింది రష్మిక. కాగా గుడ్‌బైతో పాటు హిందీలో మిషన్ మజ్ఞు, యానిమల్ చిత్రాల్లోనూ నటిస్తోంది రష్మిక. అలాగే తెలుగులో వారసుడు సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా కనిపించనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..