
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది రాశీ ఖన్నా. తొలి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంది. అందం, అభినయం ఎంత ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు స్టార్ హీరోస్ సరసన మాత్రం ఛాన్స్ అందుకోలేకపోయింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం రాశీ ఖన్నా హిందీ సినిమాలతో బిజీగా ఉంది.. ప్రస్తుతం ఆమె సుందర్ సీ దర్శకత్వంలో రూపొందుతున్న అరణ్మణై..4 చిత్రంలో నటిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత జీవితం.. ఫిల్మ్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి.. ఎవరీ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాని.. అయినప్పటికీ నటిగా మంచి పేరు సంపాదిచుకున్నానని తెలిపింది. ఇప్పటివరుక ఆ పేరును నిలబెట్టుకుంటున్నానని పేర్కొంది. విజయాలు వచ్చినప్పుడు తన అదృష్టాన్ని నమ్మలేకపోయానని.. అయితే నటిగా ఊహించిన విధంగానే అభిమానులను పొందినట్లు చెప్పింది.
మనలోని ప్రతిభను ఎప్పుడూ తక్కువ చేసుకోరాదన్నది తన భావన అని.. సినీ రంగం అంటేనే నిరంతం శ్రమించడమే అని.. ఇక్కడ ఓ కథానాయిక భవిష్యత్తు ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించలేమని తెలిపింది. హీరోయిన్ గా ఇప్పుడు అవకాశాలు రావచ్చు.. ఆ తర్వాత దారెటు అనేది తెలియకపోవచ్చు అని రాశిఖన్నా చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.