Rangam : ఎంత పని చేశావ్ అన్నా.. జీవా కెరీర్ మార్చిన రంగం.. ఈ సినిమాను మిస్సైన హీరో ఎవరంటే..

సినీరంగంలో డైరెక్టర్స్ కొంతమంది హీరోలను దృష్టిలో పెట్టుకుని కథలను రాసుకుంటారు. తాము ఊహించుకున్న నటీనటులతోనే సినిమాలు తెరకెక్కించాలని భావిస్తారు. కానీ పలు కారణాలతో ఆ ప్రాజెక్ట్స్ మరో నటీనటుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కట్ చేస్తే అలాంటి బ్లాక్ బస్టర్స్ మిస్ చేసుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరో సైతం సూపర్ హిట్ మిస్సైయ్యారు.

Rangam : ఎంత పని చేశావ్ అన్నా.. జీవా కెరీర్ మార్చిన రంగం.. ఈ సినిమాను మిస్సైన హీరో ఎవరంటే..
Rangam Movie

Updated on: Apr 23, 2026 | 6:26 PM

తెలుగు సినిమా ప్రపంచంలో పలు డబ్బింగ్ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాలు.. తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అందులో రంగం సినిమా ఒకటి. కోలీవుడ్ డైరెక్టర్ కెవి ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమిళంలో కో పేరుతో రిలీజ్ చేశారు. ఇందులో జీవా, కార్తిక, అజ్మల్ అమర్ కీలకపాత్రలు పోషించారు. 2011లో తమిళంలో విడుదలైన ఈ మూవీ థియేటర్లలో సంచలనం సృష్టించింది. ఈ చిత్రాన్ని రంగం పేరుతో తెలుగు అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. ఇక్కడ టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఈ మూవీ సక్సెస్ అయ్యింది. తాజాగా ఈ చిత్రం 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ చిత్రాన్ని ముందుగా అజిత్ లేదా కార్తితో తీయాలని భావించారట డైరెక్టర్ కెవి ఆనంద్. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. దీంతో ఈ కథను హీరో శింబుకు వినిపించారట. కథ నచ్చడంతో శింబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఫోటోగ్రాఫర్ అశ్విన్ కుమార్ పాత్రకు సంబంధించి శింబుపై కొన్ని సన్నివేశాలు సైతం చిత్రీకరించారు. కీలక షెడ్యూల్ స్టార్ట్ కావాల్సి ఉండగా.. అనుహ్యంగా శింబు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. బడ్జెట్ పరిమితుల నేపథ్యంలో అశ్విన్ కుమార్ పాత్ర కోసం దర్శకుడు జీవాను సంప్రదించగా.. ఆయన మరో మాట మాట్లాడకుండా ఒప్పుకున్నారట. ఈ సినిమా టైటిల్ కార్డ్స్ కోసం దర్శకుడు ఆనంద్ విభిన్నంగా ఆలోచించారట.

చైన్నైలోని ఫోటోగ్రాఫర్లకు తమ బెస్ట్ వర్క్ పంపించాలని కోరాగ.. దాదాపు 1000 మంది తమ ఫోటోలను పంపించారట. వాటితోనే మూడన్నర నిమిషాల టైటిల్ కార్డ్స్ డిజైన్ చేశారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ సైతం గ్లామరస్ గా కనిపించడం కన్నా.. సహజంగా సగటు జర్నలిస్టుగా ఉండాలని దర్శకుడు ఆనంద్ భావించారట. అప్పటికే జోష్ సినిమాలో నటించిన కార్తికను ఈ మూవీ కోసం తీసుకున్నారు. 2011లో ఏప్రిల్ 22న దాదాపు 230 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. మొదటి రోజు నుంచే ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని పాటలు సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ మూవీకి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

ఎక్కువమంది చదివినవి : Monalisa : మోనాలిసా ప్రేమకథలో మరో భారీ ట్విస్ట్.. అప్పట్లో కుంభమేళా సుందరి.. ఇప్పుడు గర్భిణి!

Follow Us