Ranbir Kapoor: ఆలియా ఆ విషయాల గురించి పట్టించుకోదు.. ఆసక్తికర విషయం చెప్పిన రణబీర్

|

Mar 09, 2023 | 6:31 AM

పుష్పలాంటి సినిమా తనకు పడి ఉంటే బావుండేదన్నది రణ్‌బీర్‌ చెబుతున్న మాట. అంతే కాదు, వీలైనంత త్వరలో రాజమౌళితో సినిమా చేయాలని ఉందని అన్నారు ఈ హీరో.

Ranbir Kapoor: ఆలియా ఆ విషయాల గురించి పట్టించుకోదు.. ఆసక్తికర విషయం చెప్పిన రణబీర్
Ranbir Kapoor
Follow us on

ప్రతి ఒక్కరికీ జీవితంలో గోల్స్ ఉంటాయి. వాటిని వాళ్లు ఎన్నేళ్లు సస్టయిన్‌ చేస్తారో తెలియదు కానీ, నేను మాత్రం ఏడాదికీ, రెండేళ్లకూ గోల్స్ మార్చుకుంటూ ఉంటాను అని అంటున్నారు రణ్‌బీర్‌ కపూర్‌. ప్రతి రెండేళ్లకీ నా చుట్టూ ఉన్న పరిస్థితుల్లో తప్పకుండా మార్పు కనిపిస్తూనే ఉంటుంది. ఆ మార్పులకు అనుగుణంగా నా లక్ష్యాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటుంటాయి అని అన్నారు రణ్‌బీర్‌. పుష్పలాంటి సినిమా తనకు పడి ఉంటే బావుండేదన్నది రణ్‌బీర్‌ చెబుతున్న మాట. అంతే కాదు, వీలైనంత త్వరలో రాజమౌళితో సినిమా చేయాలని ఉందని అన్నారు ఈ హీరో. ఎవరూ ఊహించని స్క్రిప్టులతో ఎవరైనా నా దగ్గరకు వస్తే చేయాలని ఉంది. కొత్తవాళ్లతో పనిచేయాలన్న థాట్‌ ప్రాసెస్‌ నడుస్తోంది అని చెబుతున్నారు బాలీవుడ్‌ చాక్లెట్‌ బోయ్‌

పెళ్లయ్యాక పాప పుట్టాక కూడా రొమాంటిక్‌ కామెడీ సినిమాలు చేస్తారా? చాక్‌లెట్‌ బోయ్‌ ఇమేజ్‌ని కంటిన్యూ చేస్తారా? అనే ప్రశ్న ఎదురైంది రణ్‌బీర్‌కి. దీనికి కాస్త డిఫరెంట్‌గా ఆన్సర్‌ చేశారు రణ్‌బీర్‌. పెళ్లికీ, రొమాంటిక్‌ సినిమాలకూ సంబంధం లేదుగానీ, ఇప్పుడు రొమాంటిక్‌ సినిమాల ట్రెండ్‌ లేదన్నది నా ఫీలింగ్‌ అని చెప్పారు.

స్క్రీన్‌ మీద హీరోయిన్లతో క్లోజ్ గా ఉంటే ఆలియా ఒప్పుకోవట్లేదట కదా.? అనే ప్రశ్నకు కూడా సరదాగా స్పందించారు రణ్‌బీర్‌. ఆమె అంత చిన్న విషయాల గురించి పట్టించుకోదు. షో బిజ్‌ గురించి మా ఇద్దరికీ తెలియనిదేమీ లేదు. ఇద్దరం ఇదే ఫీల్డ్ లో ఎదిగిన వాళ్లం. అలాంటి చిన్న విషయాలను అలా పట్టించుకోం. ఇవన్నీ ఎవరో పుట్టిస్తున్న గాసిప్స్. ఇలాంటివాటిని విని నవ్వుకుంటుంటాం అని అన్నారు రణ్‌బీర్‌.