దగ్గుబాటి యంగ్ హీరో రానా నటిస్తున్న తాజా చిత్రం విరాట పర్వం(Virata Parvam). వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు సినిమా పై అంచనాలను పెంచేశాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆ అంచనాలను ఆకాశానికి చేర్చాయి. రానా మరోసారి పవర్ ఫుల్ పాత్రతో ఆకట్టుకోనున్నాడు. ఈ సినిమాలో రానా నక్సలైట్ పాత్రలో కనిపించనున్నాడు. అతడి భావజాలను ఇష్టపడి.. అతడిని ప్రేమించే యువతి వెన్నెలగా సాయి పల్లవి కనిపించనుంది. ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవన్నగా కనిపించనున్నాడు. సాయిపల్లవితో పాటు ప్రియమణి కీలక పాత్రలో నటిస్తున్నారు. 1990ల నాటి నక్సలిజం నేపథ్యంలో నడుస్తుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ విరాట పర్వం.
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కర్నూల్ లో జరిగింది. వర్షం కారణంగా అనుకున్నంతగా ఈ కార్యక్రమం జరగలేదు. ఇక ఇప్పుడు విరాట పర్వం టీమ్ ప్రేక్షకులను కలవనున్నారు. వరంగల్ వేదికగా విరాట పర్వం చిత్రబృందంతో ఆత్మీయ వేడుక ను నిర్వహించనున్నారు. జూన్ 12న సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విరాట పర్వం సినిమా విడుదల కానుంది.
WARANGAL! U hv a Spl place in #Virataparvam‘s journey from script to screen. From inspiring the story, to evoking the poetry that is the songs and giving voice to the poetry with singers from here, Warangal is an integral part of the movie and this ‘Atmeyaveduka’ is our tribute! pic.twitter.com/XZMQuQxiX6
— v e n u u d u g u l a (@venuudugulafilm) June 10, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :